గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోర్టులో సిబిఐ ఛార్జీషీట్: ఢీలా పడ్డ వైయస్ జగన్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
గుంటూరు: సిబిఐ కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేసిన విషయం తెలిసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢీలా పడిపోయారట. జగన్ శనివారం ఉదయం 10.30 గంటలకు గుంటూరులో తన ఓదార్పు యాత్ర ప్రారంభించారు. మధ్యాహ్నం వరకు పర్యటించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కొరిటెపాడు సెంటర్‌లోని పార్టీ నేత ఇంటిలో భోజనం చేయడానికి ఆగారు. అప్పటికే, అక్రమ ఆస్తుల కేసులో ఛార్జీషీట్ దాఖలు చేయడానికి సిబిఐ అధికారులు కోర్టుకు బయల్దేరిన వార్తలు టివి ఛానళ్లలో వస్తున్నాయి. భోజనం చేస్తున్న జగన్ మౌనంగానే ఆ వార్తలను వీక్షించారట. ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆయన మళ్లీ తన యాత్రను ప్రారంభించారు. సరిగ్గా గుంటూరు శ్రీనగర్ కాలనీలో ఉండగా, సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆయన పేరును ఎ-1గా పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.

ఈ విషయాన్ని పక్కనే ఉన్న జిల్లా నేతలు జగన్‌కు తెలిపారట. ఇది వినగానే ఆయన ఒక్కసారిగా ఢీలా పడిపోయరట. విషయం తెలిసిన తర్వాత మరికొన్ని గంటల పాటు పర్యటించినా, ఎక్కడా కూడా నోరు విప్పి ఎక్కువగా మాట్లాడలేదట. చివరిలో ఒక బహిరంగ సభలో మాట్లాడినా సిబిఐ, ఛార్జీషీట్ వ్యవహారంపై ఒక్క ముక్క కూడా మాట్లాడలేదట. వచ్చే ఉప ఎన్నికలు మినీ ఎన్నికల లాంటివని, ఆ ఎన్నికల్లో పార్టీకి విజయం చేకూర్చి ఢిల్లీ పెద్దలకు వణుకు పుట్టించాలని కోరుతూ ప్రసంగాన్ని ముగించారట. ఆ సభ తర్వాత మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉన్నా, అర్ధాంతరంగా యాత్రను ముగించుకొని రాత్రి ఎనిమిది గంటల సమయంలో పార్టీకి చెందిన ఒక నేత ఇంటిలో బస చేసేందుకు వెళ్లిపోయారట.

English summary
It seems, YSR Congress Party chief YS Jaganmohan Reddy completed his Odarpu Yatra soon on saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X