డిసెంబర్ 4న మందకృష్ణ మాదిగ రాజకీయ పార్టీ

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రకటించిన విధంగా జనాభా దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు అనే అంశానికి తాము మద్దతు ఇస్తున్నామన్నారు. వికలాంగులకు పెన్షన్ పెంచేది లేదని ప్రకటించడం మంత్రి సునితా లక్ష్మారెడ్డి అహంకారానికి నిదర్శనంగా ఉందని ఆయన అన్నారు.
వికలాంగుల పెన్షన్ 1500 రూపాయలకు పెంచాలనేది వికాలంగుల హక్కుల పోరాటసమితి ప్రధాన డిమాండ్ అని కాని రు.750 పెన్షన్ ఇస్తామనేది ప్రభుత్వ హామీ అని అన్నారు. తమ డిమాండ్ సంగతి అటుంచితే వారు ఇచ్చిన హామీని వారు నిలబెట్టుకుంటారో లేదోతేల్చకుండా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీతో తమకు సంబంధం లేదన్నట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.
మంత్రి ప్రకటనతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వికలాంగుల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదని తేలిపోయిందని అన్నారు. ఒకవైపువికలాంగుల పెన్షన్ విషయంలో ప్రతిపక్షాల సూచనలు కూడా తీసుకుంటామని చెబుతూనే ప్రతిపక్షాలు ఈ విషయంలో అనవసర రాజకీయం చేస్తున్నాయని విమర్శించడం శోచనీయమని అన్నారు.












Click it and Unblock the Notifications