• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పీఠంకోసం నేతల ఫీట్లు: బాటతో బాబు,జగన్ ఢిల్లీలో చిరు

By Srinivas
|

హైదరాబాద్: 2014లో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడానికి ఆయా పార్టీల నేతలు వివిధ రకాల ఫీట్లు చేస్తున్నారు. ప్రధానంగా పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేస్తుండగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన సోదరి షర్మిలచే మరో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర తలపెట్టారు.

మూడోసారైనా గట్టెక్కాలని

మూడోసారైనా గట్టెక్కాలని

తెలుగుదేశం పార్టీ ఇప్పటికే రెండు పర్యాయాలు ప్రతిపక్షంలో కూర్చుంది. దీంతో ఆ పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో తీవ్ర నిస్తేజం గూడుకట్టుకుంది. దీనికి తోడు ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముఖ్య నేతలను ఆకర్షిస్తూ.. ఆ పార్టీని మరింత సంక్షోభంలో పడేసింది. దీంతో చంద్రబాబు పార్టీని రక్షించుకుంటూనే 2014లో అధికారంలోకి తీసుకు వచ్చేందుకు పాదయాత్రకు సిద్ధమయ్యారు. 63ఏళ్ల వయస్సులో 2200 కిలోమీటర్ల పాదయాత్ర అంటే మామూలు విషయం కాదు.

కానీ పార్టీని గట్టెక్కించి ముఖ్యమంత్రి పీఠం కూర్చునేందుకు బాబుకు ఇంతకు మించిన తరుణోపాయం కనిపించినట్లుగా లేదు. కనీసం ఈసారైనా పార్టీని అధికారంలోకి తెచ్చి సిఎం పదవిని దక్కించుకోవాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. ఆయన ఆశించినట్లుగానే ఆయన వస్తున్నా మీకోసం పాదయాత్రకు ప్రజలు నీరాజనం పడుతున్నారు. సాధారణ ఎన్నికలకు సంవత్సరంన్నర ముందు ఆయన చేపట్టిన ఈ యాత్ర పార్టీలో కొత్త ఉత్సాహం తీసుకు వచ్చింది. దీనిని చూసిన నేతలు బాబును రెండో విడత యాత్రకు కూడా సిద్ధం చేస్తున్నారు.

 సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకుంటూ

సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకుంటూ

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇతర పార్టీలలోని ముఖ్య నేతలను తమ పార్టీ వైపుకు ఆకర్షిస్తూ.. ప్రజల్లో ఉన్న సెంటిమెంట్‌ను అలాగే ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు. సెంటిమెంట్ ప్రధానంగానే 2014 ఎన్నికలలో గట్టెక్కాలని చూస్తున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సెంటిమెంట్ కారణంగానే ఘన విజయం సాధించింది. గెలుపు ఎలాగూ జగన్ పార్టీదే అని తెలిసినప్పటికీ సెంటిమెంట్ తోడు కావడం భారీ విజయం దక్కించుకుంది.

జగన్ జైలుకు వెళ్లడం, వైయస్ హెలికాప్టర్ ప్రమాదంపై అనుమానాలకు తోడు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ, కూతురు షర్మిల ప్రచార బరిలోకి దిగడం వంటి సెంటిమెంట్ ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. బాబు పాదయాత్రతో ప్రజల్లోకి వెళుతుండటంతో ఆ సెంటిమెంట్‌ను అలాగే ఉంచే ప్రయత్నాల్లో భాగంగా షర్మిలచే ఆ పార్టీ పాదయాత్ర తలపెట్టింది. పాదయాత్ర ఇన్ని రోజుల్లో పూర్తవుతుందని చెప్పకపోవడాన్ని బట్టి చూస్తుంటే జగన్ వచ్చే వరకు లేదా ఎన్నికల ముందు వరకు దీనిని కొనసాగించే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

కాంగ్రెసులో కూర్చీలాట

కాంగ్రెసులో కూర్చీలాట

కాంగ్రెసులో ముఖ్యమంత్రి పీఠం కోసం చాలామందే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆ పీఠంపై కూర్చున్న కిరణ్ కుమార్ రెడ్డి 2014 వరకు కొనసాగేందుకు ముప్పు తిప్పలు పడుతున్నారు.

ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 2014 వరకు తన పదవి ఊడిపోకుండా ఉండేందుకు ఓ వైపు ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు ఆ తర్వాత కూడా తానే సిఎం అయ్యేలా వ్యూహాలు రచిస్తున్నారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా ఇదే ప్రయత్నాల్లో ఉన్నారు. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కూడా ఢిల్లీలో ఎత్తులు వేస్తున్నారట. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి కూడా తెలంగాణ పేరుతో పీఠంపై కన్నేశారనే ప్రచారం జోరుగానే జరుగుతోంది.

కాంగ్రెసులో కుర్చీలాట

కాంగ్రెసులో ముఖ్యమంత్రి పీఠం కోసం చాలామందే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆ పీఠంపై కూర్చున్న కిరణ్ కుమార్ రెడ్డి 2014 వరకు కొనసాగేందుకు ముప్పు తిప్పలు పడుతున్నారు. అదే సమయంలో వచ్చే సాధారణ ఎన్నికలలో పార్టీ గెలిస్తే మళ్లీ ఆ పదవి చేపట్టేందుకు వీలుగా ఇటు ప్రజల్లో నిత్యం ఉంటూనే అటు ఢిల్లీ పెద్దల నోట్లో నానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన నానా తంటాలు పడుతున్నారట. ఇటీవల తెలంగాణ కవాతు సమయంలో కిరణ్ వ్యవహరించిన తీరుపై అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ఢిల్లీ పెద్దల నుండి మరిన్ని మంచి మార్కులు కొట్టేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు.

పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా ఆ రేసులో ఉన్నారు. కొన్నాళ్ల క్రితం వరకు ఆయన తాను సిఎం రేసులో ఉన్నానని చెప్పేవారు. కానీ ఇటీవల కిరణ్‌తో వచ్చిన విభేదాల నేపథ్యంలో ఢిల్లీ పెద్దల నుండి చివాట్లు పడటంతో ఆయన కాస్త తగ్గారు. అయితే చెప్పడంలో తగ్గినప్పటికీ 2014లో పీఠం దక్కించుకునేందుకు ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు చిరంజీవి కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యవహారాలను ఢిల్లీ పెద్దలకు చేరవేస్తూ.. పావులు కదుపుతున్నారట. ఇప్పటికే కిరణ్, బొత్సపై అధిష్టాం కాస్త అసంతృప్తితో ఉంది. దీనిని మరింత క్యాష్ చేసుకునే విధంగా చిరు ముందుకు వెళుతున్నారట.

English summary
Leaders like TDP chief Nara Chandrababu Naidu, YSR Congress party president YS Jaganmohan Reddy and MP Chiranjeevi are trying to get CM post in 2014 general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X