కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుపై విమర్శలకే షర్మిల పాదయాత్ర: కెఇ

By Pratap
|
Google Oneindia TeluguNews

KE Krishna Murthy
కర్నూలు/ హైదరాబాద్: ప్రజా సమస్యలపై పోరాడకుండా కేవలం తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని విమర్శించేందుకే షర్మిల పాదయాత్ర చేస్తున్నారని తెలుగుదేశం నేత, డోన్ ఎమ్మెల్యే కెఇ కృష్టమూర్తి అన్నారు. శుక్రవారం కర్నూలులో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఉన్న లోపాయికారీ ఒప్పందం మేరకే చంద్రబాబును షర్మిల లక్ష్యంగా చేసుకున్నారన్నారు. విజయలక్ష్మి సహా ఆ పార్టీ నేతలు రహస్యంగా చేస్తున్న ఢిల్లీ యాత్రలు కాంగ్రెస్‌తో వారు కుమ్మక్కు అయ్యారన్న విషయం స్పష్టం చేస్తున్నాయన్నారు.

ప్రభుత్వంపై చంద్రబాబు ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదని విమర్శిస్తున్న షర్మిలకు ఇదివరకే ఆయన ఒకసారి అవిశ్వాసం పెట్టారనే విషయం తెలియదా అని ఆయన ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకికి చెందిన 17 మంది శాసనసభ్యులు గవర్నర్‌ను కలిసి తాము కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినందుకు ప్రభుత్వం మైనార్టీలో పడిందని ఫిర్యాదు చేయాలని కేఈ సవాల్ చేశారు.

షర్మిల చేస్తున్న అర్థం, పర్థంలేని ఆరోపణలు చూసి ప్రజలు నవ్వుకుం టున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ వెైవీబీ రాజేంద్ర ప్రసాద్‌ ఎద్దేవా చేశారు. అరిగిపోయిన గ్రామ్‌ఫోన్‌ రికార్డులా పాడిన పాటే పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌, టీడీపీలు ఏ విధంగా కుమ్మక్కయ్యాయో ప్ర జలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్‌, కాంగ్రెస్‌ పార్టీ కు మ్మకై్కయ్యాయనడానికి చాల స్పష్టమైన ఆదారాలున్నాయని ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో అన్నారు.

కాంగ్రెస్‌తో వెైసీపీ కుమ్మక్కు కాలేదని నిరూపించు కోవాలంటే తాము వేసే పది ప్రశ్నలకు సమా ధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సోనియా అల్లుడు రాబర్ట్‌వాద్రా అవినీతిపెై వెైసీపీ ఎందుకు స్పందించలేదని, సోనియా, రాహుల్‌గాంధీ 1600 కోట్ల కుంభ కో ణంపెై ఎందుకు మాట్లాడడం లేదని, వెైఎస్‌ విజయ, భారతీలు రహస్యంగా వెళ్లి కాంగ్రెస్‌ పెద్దలను చాటుమాటున ఎందుకు కలుస్తున్నారని ఆయన అడిగారు.

రాష్టప్రతి, ఉపరాష్టప్రతి ఎన్ని కల్లో కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేశారు రాష్ట్ర శాసన సభ స్పీకర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి ఎందుకు ఓటు వేశారు వెైఎస్‌ను సోనియా చంపించిందని ఉప ఎన్నికల్లో ప్రచారం చేసి ఓట్లు వేయించుకుని ఈ రోజున ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. దీనిపై విచారణ ఎందుకు కోరడం లేదు అవిశ్వాసం పెడితే మా దగ్గర 70 మంది ఎమ్మె ల్యేలున్నారని, అవిశ్వాసం పెడితే ఏమి చేశారో ప్రజలకు తెలుసు 17 మంది మాత్రమే ఎందుకు ఓటు వేశారు కేంద్రంలో యుపీఏకు మద్దతునిచ్చి వ్యవసా యం, రెైల్వేశాఖలు తీసుకుంటానని జగన్‌ ప్రకటించలేదా అని కూడా ఆయన అడిగారు.

English summary
Telugudesam party leaders KE Krishna Murthy lashed out at YSR Congress party president YS Jagan's sister Sharmila. He said that Sharmila has taken up padayatra to criticize Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X