Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బంధించి ఆరు రోజులు అత్యాచారం: ప్రేమ వేధింపులతో...

Hyderabad
హైదరాబాద్: ఓ యువతిని ఇంట్లో నిర్భందించి అత్యాచారానికి పాల్పడిన యువకుడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కూకట్‌పల్లి సిఐ శ్రీనివాస్‌ రావు విలేఖరులకు తెలిపారు. తన కూతురిని గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడని, ఈ విషయాన్ని తన మొబైల్‌కు ఎస్సెమ్మెసే పంపిందని ఆదివారం ఉదయం కూకట్‌పల్లిలోని బాగ్అమీరీకి చెందిన ఓ వ్యక్తి కూకట్‌పల్లి స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బాలానగర్, సాయినగర్‌ కాలనీలోని ఓ ఇంటి నుంచి ఎస్సెమ్మెస్ వచ్చినట్టు గుర్తించారు. సోదా చేయడానికి ప్రయత్నించగా, ఇంటి తలుపునకు తాళం వేసి ఉంది. తమ అలికిడి విని ఇంట్లో అప్పటి వరకు వెలుగుతున్న లైటును ఆర్పివేశారు. పోలీసులకు అనుమానం వచ్చింది. తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా వంటగదిలో ఇరవయ్యొక్క ఏళ్ల ఓ యువతి అపస్మారకస్థితిలో పడి ఉంది.

ఆమె కాళ్లు, చేతులు కాళ్లతో కట్టేసి ఉన్నాయి. అదే ఇంట్లో ఉన్న కృష్ణం రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అపస్మారకస్థితిలో ఉన్న యువతిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కొన్ని సంవత్సరాల క్రితం మహారాష్ట్ర నుంచి నగరానికి వచ్చిన కృష్ణం రాజు కుటుంబంతో సాయినగర్ కాలనీలో ఉంటూ.. ఇంట్లోనే ప్యాకర్స్ అండ్ మూవర్స్ కార్యాలయాన్ని ప్రారంభించాడు.

బాధిత యువతి కృష్ణం రాజు వద్ద కొంతకాలం పని చేసింది. అతని వద్ద పని చేసినప్పుడు తనను వేధించాడని ఆమె వాంగ్మూలం ఇచ్చింది. అందుకే తాను పని మానుకున్నానని తెలిపింది. అయినప్పటికీ కృష్ణం రాజు వేధింపులు మానలేదని తెలిపింది. దీంతో తల్లితో కలిసి ఏలూరు వెళ్లిపోయానని చెప్పింది. డిసెంబర్ 30న ఏలూరు వచ్చిన కృష్ణంరాజు తన తండ్రి పరిస్థితి బాగాలేదని, ప్రాణాపాయస్థితిలో ఉన్నాడని, తనను చూడాలంటున్నాడని చెప్పాడని తెలిపింది.

అతని మాటలు విని ఆటోలో వస్తుండగా మత్తుమందు ఇచ్చి హైదరాబాద్ తీసుకు వచ్చి సాయినగర్‌లోని ఇంట్లో నిర్భందించి పలుమార్లు అత్యాచారం చేశాడని చెప్పింది. ఫిర్యాదు అందిన గంటల వ్యవధిలోనే కేసును ఛేదించామని కూకట్‌పల్లి సిఐ తెలిపారు. యువతి ఏలూరులో కిడ్నాప్‌కు గురైనా ఆమె తండ్రి కూకట్‌పల్లిలో ఫిర్యాదు చేశారని, వెంటనే స్పందించి యువతి ఆచూకీ తెలుసుకున్నామన్నామన్నారు.

యువతిని బంధించిన ప్రాంతం బాలానగర్ పోలీసుస్టేషన్ పరిధిలోకి వస్తుందని, ఉన్నతాధికారులతో చర్చించి కేసును బాలానగర్ స్టేషన్‌కు బదిలీ చేస్తామని తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు. నిందితుడు యువతిని ఆరు రోజులు బంధించి ఆమెపై విచక్షణా రహితంగా ప్రవర్తించాడు.

ప్రేమ పేరుతో వేధింపులు

ప్రేమ పేరుతో పదిహేడేళ్ల బాలికను నిత్యం వేధింపులకు గురి చేస్తుండటంతో ఆమె విషం తాగి చనిపోయింది. మెహిదీపట్నంలోని ఓ ప్రయివేటు కళాశాలలో చదువుతున్న మౌనికను రెండేళ్లుగా వెంకటేష్ అనే వ్యక్తి పేరుతో వేధిస్తున్నాడు. ఎవరు మందలించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో మూడు రోజుల క్రితం మౌనిక విషం తాగింది. ఆమెను కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ శనివారం కన్నుమూసింది. పోలీసులు వెంకటేష్‌ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+