వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ కన్నుమూత

By Pratap
|
Google Oneindia TeluguNews

వెనిజులా: గత కొంత కాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్(58) బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కరాకన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చావెజ్ మృతి చెందాడు. ఆయన మృతితో చమురు దేశం వెనిజులా దిక్కు లేకుండా పోయింది.

1998లో తొలిసారిగా వెనుజులా అధ్యక్షుడిగాచావెజ్ ఎన్నికయ్యాడు. చావెజ్ 14 ఏళ్లకు పైగా వెనుజులాను పాలించాడు. అత్యంత ప్రభావశీలిగా ప్రఖ్యాతి వహించిన చావెజ్ దాదాపు మూడు నెలల పాటు ప్రజల ముందుకు రాలేదు, ఏమీ మాట్లాడలేదు.

క్యూబాలో క్యాన్సర్‌కు రెండు నెలల పాటు చికిత్స చేయించుకున్న తర్వాత మిలిటరీ ఆస్పత్రిలో చేరాడు. గత ఏడాదిన్నర కాలంలో ఆయన నాలుగో విడత క్యాన్సర్‌కు చికిత్స చేయించుకున్నారు.

Hugo Chavez passes away

చావెజ్ 14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. ఆరో విడత అనారోగ్యం కారణంగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. చావెజ్ పరిపాలించే స్థితిలో లేనందున మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. చావెజ్ మృతితో లాటిన్ అమెరికా దేశాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

చావెజ్ మృతితో వెనిజులాలో ఎన్నికలు అనివార్యంగా మారాయి. అయితే, సత్యసాయిబాబ శిష్యుడైన ఉపాధ్యక్షుడు నికోలస్ మాడురోకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు హెన్రిక్ కాప్రిల్స్‌ను నిలిపే అవకాశాలున్నాయి.

English summary
From life, Hugo Chavez has moved into history. A living legend for millions of poor in his country and a divisive figure in global politics, the Venezuelan president died on Tuesday. He was 58.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X