వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్లడ్స్: పుట్‌పాత్‌పై ఎన్టీఆర్ ట్రస్ట్, సైన్యానికి సలాం(పిక్చర్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయక చర్యలు మంగళవారం కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో వర్షం కురుస్తుండటంతో ఆటంకం కలుగుతోంది. ఉత్తర కాశీ, చమోలీ, డెహ్రాడూన్ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లోని బాధితులకు సహాయ చర్యలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

బద్రీనాథ్, హర్షిల్ ప్రాంతాల్లో పలువురు భక్తులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. బద్రీనాథ్‌లో దాదాపు ఐదువేల మంది, హర్షిల్‌లో దాదాపు వెయ్యి మంది యాత్రికులు ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగు వారు పలువురు స్వగృహాలకు చేరుకుంటున్నారు.

ప్రభుత్వ సహాయంతో పాటు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. ఈ విమానంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు ఇళ్లకు చేరుకున్నారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో తరలించిన భక్తులను, ఆయా ప్రాంతాల నుండి టిడిపి నేత ట్రావెల్స్ ద్వారా ఇళ్లకు చేరుస్తున్నారు.

మరోవైపు ఎపి భవన్ వద్ద ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్యులు వైద్యం చేసేందుకు అధికారులు అనుమతిని నిరాకరించారు. ఎపి భవన్ ముందు నుండి ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్య శిబిరాన్ని అధికారులు తొలగించారు. ఈ సమయంలో నామా నాగేశ్వర రావు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఫుట్ పాత్ పైనే వారు బాధితులకు చికిత్సను అందిస్తున్నారు.

చంద్రబాబు ఢిల్లీలోని ఎపి భవన్లో ఉత్తరాఖండ్ బాధిత యాత్రికులను పరామర్శించారు. ఆయన రాష్ట్రంలోని పార్టీ నేతలకు ఫోన్ చేసి బాధితులు ఇంటికి చేరుకునే వరకు అండగా ఉండాలని ఆదేశించారు. మరోవైపు రైల్వే శాఖల ఏర్పాటు చేసిన పలు రైళ్లలో భక్తులు రాష్ట్రానికి చేరుకుంటున్నారు.

ఫ్లడ్స్: ఫుట్‌పాత్‌పై ఎన్టీఆర్ ట్రస్ట్, సైన్యంకి సలాం(పిక్చర్స్)

ఎపి భవన్ సమీపంలో ఉత్తరఖండ్ బాధితులకు చికిత్సను అందిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్యులు. ఎపి భవన్‌లోకి అధికారులు నిరాకరించారు. దీంతో ఈ రోజు ట్రస్ట్ వైద్యులు ఫుట్ పాత్ పైన చికిత్స అందిస్తున్నారు.

ఫ్లడ్స్: ఫుట్‌పాత్‌పై ఎన్టీఆర్ ట్రస్ట్, సైన్యంకి సలాం(పిక్చర్స్)

ఉత్తరాఖండ్ వరదల్లో భారత జవాన్లు, భారత వైమానిక దళం చేరుకోలేని ప్రాంతాల్లో కూడా భక్తులు చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకు రావడం మన జవాన్లకు పెద్ద సవాలే.

 ఫ్లడ్స్: ఫుట్‌పాత్‌పై ఎన్టీఆర్ ట్రస్ట్, సైన్యంకి సలాం(పిక్చర్స్)

భారీ వర్షాలు కురిసినందు వల్ల వచ్చిన వరదలతో కొట్టుకుపోయిన రహదారి. ఆ వైపుకు, ఈ వైపుకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.

ఫ్లడ్స్: ఫుట్‌పాత్‌పై ఎన్టీఆర్ ట్రస్ట్, సైన్యంకి సలాం(పిక్చర్స్)

భారీ వరద కారణంగా భారత జవాన్ల సహకారంతో సురక్షిత ప్రాంతానికి చేరుకుంటున్న ఓ భక్తుడు.

ఫ్లడ్స్: ఫుట్‌పాత్‌పై ఎన్టీఆర్ ట్రస్ట్, సైన్యంకి సలాం(పిక్చర్స్)

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లో ఓ చోట వరద ఉధృతి తీవ్రత.

ఫ్లడ్స్: ఫుట్‌పాత్‌పై ఎన్టీఆర్ ట్రస్ట్, సైన్యంకి సలాం(పిక్చర్స్)

వృద్ధులను, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, నడవలేని వారిని సైనికులు తమ భుజాలపై ఎత్తుకొని మోస్తూ సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు.

ఫ్లడ్స్: ఫుట్‌పాత్‌పై ఎన్టీఆర్ ట్రస్ట్, సైన్యంకి సలాం(పిక్చర్స్)

వరదల కారణంగా గాయపడ్డ ఓ భక్తుడి గాయానికి మందు పూస్తున్న ఓ వైద్యుడు.

ఫ్లడ్స్: ఫుట్‌పాత్‌పై ఎన్టీఆర్ ట్రస్ట్, సైన్యంకి సలాం(పిక్చర్స్)

ఉత్తరాఖండ్ వరద బాధితులను ఆదుకునేందుకు సైనికులు భారీ సాహసం చేస్తున్నారు. యాత్రికులను ఆదునాతన హెలికాప్టర్‌లో తరలిస్తున్న దృశ్యం

ఫ్లడ్స్: ఫుట్‌పాత్‌పై ఎన్టీఆర్ ట్రస్ట్, సైన్యంకి సలాం(పిక్చర్స్)

పర్వతసానుల్లో చిక్కుకున్న బాధితులను ఓ వంతెన ద్వారా, ఇతర మార్గాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న జవాన్లు.

English summary
Heavy rains again hit flood ravaged in Uttarakhand. Army teams raced against time to rescue stranded people and provide them succor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X