అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరిటాల శ్రీరామ్ నిరాహార దీక్ష: పోలీసుల అడ్డంగులు.. తర్వాత కంటిన్యూ.. ఇంతకీ ఎందుకంటే..

|
Google Oneindia TeluguNews

ఏపీలో జిల్లాల ఏర్పాటు.. రెవెన్యూ డివిజన్ల ఏర్పాట్లు, రద్దు ఆంధ్రప్రదేశ్‌లో అగ్గి రాజేసింది. ధర్మవరం రెవెన్యూ డివిజన్‌ను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిని టీడీపీ నిరసిస్తోంది. ఆ పార్టీ పరిటాల శ్రీరామ్ నిరాహార దీక్షకు దిగారు. స్థానిక ఎమ్మార్మో కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నారు. జిల్లాల పునర్విభజన, ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆయన ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు చేయడం ఆటవిక విధానంగా ఉందన్నారు.

 ఏసీ గదిలో కూర్చొని..

ఏసీ గదిలో కూర్చొని..

ఏసీ రూముల్లో కూర్చుని విజయవాడలో నిర్ణయం చేయడం సమంజసం కాదన్నారు. ప్రజలకు ఏది అనుకూలమో కూడా ఆలోచించాలని.. ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు వల్ల 8 మండలాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఎక్కడ కళ్యాణదుర్గం, ఎక్కడ రామగిరి కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్‌లో రామగిరి ఏ విధంగా కలుపుతారని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రెవెన్యూ డివిజన్‌లో మార్పు జరిగిందన్నారు.

 అడ్డంకులు

అడ్డంకులు

అంతకు ముందు ఉదయం ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకులు సృష్టించారు. ఎమ్మార్వో కార్యాలయం వద్ద వేసిన దీక్షా ప్రాంగణం టెంట్లను తొలగించారు. చిన్నపాటి వేదికను ఏర్పాటు చేసుకోవాలని టీడీపీ నేతలకు పోలీసులు సూచించారు. కానీ ఆయన దీక్షను మాత్రం కంటిన్యూ చేస్తున్నారు.

 పాలన కోసమే..

పాలన కోసమే..

ఇదిలా ఉంటే పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లాల ఏర్పాటు చేస్తున్నామని అధికార పార్టీ నేతలు తెలిపారు. కొందరు కావాలనే వివాదం రాజేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ఉగాది లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం అనుకుంటుంది. పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై 30 రోజుల్లోగా అభ్యంతరాలు తెలియజేయాలని కోరింది.

Recommended Video

Bheem Deeksha : KCR కు సీఎం పదవిలో కొనసాగే హక్కు లేదన్న మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ | Oneindia Telugu
 లోక్‌సభ కేంద్రం జిల్లాగా..

లోక్‌సభ కేంద్రం జిల్లాగా..

శ్రీకాకుళం కేంద్రంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఉండనుంది. ఈ జిల్లాలో ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, అముదాలవలస, పాతపట్నం, నరసన్నపేట శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. విజయనగరం కేంద్రంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఉండనుంది. రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపు కోట, గజపతినగరం శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. విశాఖపట్నం కేంద్రంగా 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఉండనుంది. భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ నార్త్, విశాఖ వెస్ట్, విశాఖ సౌత్, గాజువాక శాసనసభ స్థానాలు ఉండనున్నాయి. ప్రతీ లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా.. ఇంతకుముందు ఉన్నవాటిని కలుపుకొని ప్రకటించారు. కానీ జిల్లా, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై అభ్యంతరాలు వస్తూనే ఉన్నాయి.

English summary
tdp leader paritala sri ram hunger strike at dharmavaram mro office infront. he opposo dharmavaram revenue division remove.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X