లాంచీ ప్రమాదం: వారంలో రెండో ప్రమాదం, ఆ సమాచారం తెలిస్తే బోటు మునిగేదికాదు

Recommended Video

    Around 30 Feared Drowned as Boat Capsizes in Godavari River

    ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని గోదావరి నదిలో లాంచీ మునిగిన ప్రాంతాన్ని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల మధ్యలో ఈ పడవ మునిగిపోయి ఉందని అధికారులు తెలిపారు. ఈ పడవను బయటకు తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.

    తూర్పుగోదావరి జిల్లాలో లాంచీ మునిగిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. సుమారు 36 మంది ఈ ప్రమాదంలో గల్లంతయ్యారు. సుమారు 50 అడుగుల లోతులో లాంచీ ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు.

    లాంచీ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నేవీ అధికారులు, గజ ఈతగాళ్లు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను చేపట్టారు.

    రెండు జిల్లాల మధ్యలో మునిగిన లాంచీ

    రెండు జిల్లాల మధ్యలో మునిగిన లాంచీ

    ఉభయగోదావరి జిల్లాల మధ్యలో లాంచీ మునిగిపోయినట్టుగా అధికారులు గుర్తించారు. లాంచీని గోదావరి నది నుండి బయలకు తీసేందుకు ప్రయత్నాలను ప్రారంభించారు. భారీ క్రేన్ల సహయంతో లాంచీని నది నుండి బయటకు లాగేందుకు ప్రయత్నాలను బుధవారం నాడు ఉదయం ప్రారంభించారు. లాంచీని నది నుండి వెలికి తీస్తే గల్లంతైన వారి విషయంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

    ఆ సమాచారం లాంచీ సిబ్బందికి అందలేదు

    ఆ సమాచారం లాంచీ సిబ్బందికి అందలేదు

    మంగళవారం నాడు వాతావరణంలో మార్పుల గురించిన సమాచారం లాంచీ సిబ్బందికి అందించలేకపోయినట్టు కలెక్టర్ తెలిపారు.ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఈదురుగాలుల కారణంగానే లాంచీ ప్రమాదానికి గురైందని కలెక్టర్ తెలిపారు. అయితే ఈదురుగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని లాంచీ సిబ్బందికి సమాచారం ఇచ్చేసరికి అప్పటికే లాంచీ నదిలోకి వెళ్ళిపోయిందని చెప్పారు. ఈ సమాచారం లాంచీ సిబ్బందికి చేరి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమోనని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

     లాంచీ ప్రమాదంపై బాబు రివ్యూ

    లాంచీ ప్రమాదంపై బాబు రివ్యూ

    లాంచీ ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. గాలింపుతో పాటు సహయక చర్యల గురించి బాబు ఆరా తీశారు. గాలింపును ముమ్మరం చేయాలని బాబు అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలానికి కొద్దిసేపట్లో బాబు చేరుకోనున్నారు. మృతదేహల దేహల వెలికితీతతో పాటు అవసరమైతే భారీ క్రేన్లను కూడ తెప్పించాలని బాబు అధికారులను ఆదేశించారు.

    వారంలో రెండో ప్రమాదం

    వారంలో రెండో ప్రమాదం


    తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో వారం రోజుల క్రితం పాపికొండల టూర్ కు వెళ్తున్న లాంచీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో సుమారు 80 మంది పర్యాటకులున్నారు. అయితే ఆ సమయంలో లాంచీ డ్రైవర్ లాంచీని గోదావరి ఒడ్డుకు తీసుకొచ్చి నిలిపివేశారు. స్థానికులు లాంచీ నుండి పర్యాటకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటన జరిగి వారం రోజులు గడవకముందే ఇదే ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+