"సిగ్గు పడండి.."- సుప్రీం ఆదేశాలపై ఏబీ వెంకటేశ్వరరావు ట్వీట్..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇవాళ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన ఆదేశాలు చర్చనీయాంశమయ్యాయి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భారీ ఎత్తున హింస చోటు చేసుకున్నా, అభ్యర్ధులు నామినేషన్ దాఖలు చేసే పరిస్ధితులు లేకుండా పోయినా నామినేషన్ల గడువు పొడిగించని ఎస్ఈసీకి సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విజయవాడ మేయర్ గా పోటీ చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సుప్రీం ఆదేశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏబీ పోటీ వెనుక చంద్రబాబు ? జగన్ ఇండీ పాలిటిక్స్- సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..!
ఏబీ పోటీ వెనుక చంద్రబాబు ? జగన్ ఇండీ పాలిటిక్స్- సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..!

స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు పడాలంటూ ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) ట్వీట్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఇలాగేనా? అని ఆయన ప్రశ్నించారు. మీరు విజయవాడలో శాంతి భద్రతలు కాపాడతారని నమ్మాలా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో పాటు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తన ట్వీట్ లో పేర్కొన్నారు. 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువు పెంచాలని, వైయస్ఆర్సీపీ అభ్యర్ధులకు భద్రత కల్పించాలని ఎస్పీలకు ఇచ్చిన ఆదేశాలను పేర్కొన్నారు.

Shame on You AB Venkateswara Rao Questions AP Government SEC Over Local Body Polls
 ఏపీలో నామినేషన్ల పొడిగింపుపై సుప్రీం కీలక ఆదేశాలు-వైసీపీకి ఊరట..!
ఏపీలో నామినేషన్ల పొడిగింపుపై సుప్రీం కీలక ఆదేశాలు-వైసీపీకి ఊరట..!

అలాగే విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని కూడా ఏబీ వెంకటేశ్వరరావు ప్రస్తావించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని, ఒక్క పోలీస్ కంప్లైంట్ రాలేదని ప్రభుత్వం చెబుతుందంటే..ఎంత దారుణమైన పరిస్థితి ఉందో మాకు అర్దం అవుతుందని, హింస జరుగుతుంటే, లా అండ్ ఆర్డర్ లేకపోతే, నామినేషన్లు వేయడానికి ఎవరు వస్తారన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో లెవల్ ప్లేయింగ్ పీల్డ్ ఉండాలని, ప్రతిపక్షాలకు అవకాశం ఉండాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ట్వీట్ లో పేర్కొన్నారు. అలాగే వైసీపీ న్యాయవాది వాదనల్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు. వైయస్ఆర్సీపీ నేతలను కొట్టివారిపైనే కేసులు పెట్టారని, ఫిర్యాదులను పోలీసులు తీసుకోవడం లేదని, 19 మున్సిపాలిటీల్లో 63.5శాతం వైయస్ఆర్సీపీ నామినేషన్లు లేకుండా చేశారని, ఇది చాలా తీవ్రమైన ఇష్యూ అని, నామినేషవ్ సెంటర్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని, సిట్టింగ్ ఎంపీ కారుపైదాడి చేశారని, రాళ్లు విసిరారని, దాడులు చేసి తిరిగి వారిపైనే కేసులు పెట్టారని లాయర్ సుప్రీంకోర్టులో వాదించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+