రేపు ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన ఏబీవీపీ .. ఎందుకంటే
ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం నడుం బిగించింది. అయినప్పటికీ విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం ఆంధప్రదేశ్ లో రేపు పాఠశాలల బంద్ నిర్వహించనున్నట్లు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలిపింది. ముఖ్యంగా 9 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తాము బంద్ చేపట్టనున్నట్లు ఏబీవీపీ నేతలు చెప్తున్నారు .
Recommended Video


రేపు ఏపీలో స్కూళ్ళు బంద్ .. విద్యా సమస్యల పరిష్కారం కోసం బంద్ కు పిలుపు
కార్పోరేట్ ప్రైవేట్ స్కూల్స్ లో దోపిడీకి చెక్ పెట్టాలని వారు కోరారు. ప్రభుత్వ పాఠశాలలను పటిష్టపరిచే దిశగా ఏపీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లను నిరుపేదలకు కేటాయించేలా చూడాలన్న డిమాండ్ ను వారు ప్రభుత్వం ముందు ఉంచారు . విద్యాహక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేయాలనీ, ఏపీలో ఇన్నాళ్లూ ఖాళీగా ఉన్న డీఈవో, డిప్యూటీ డీఈవో, ఎంఈవో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీని నిర్వహింఛి ఆ పనిని త్వరిత గతిన పూర్తి చెయ్యాలని కోరారు .

కార్పోరేట్ విద్యా మాఫియాపై ఉక్కు పాదం మోపండి అంటున్న ఏబీవీపీ
ఇక అంతే కాదు విద్యార్థులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. అమ్మ ఒడి పథకాన్ని ఏబీవీపీ స్వాగతిస్తోందని అయితే కార్పొరేట్ విద్య మాఫియాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలనే డిమాండ్ చేస్తున్నారు . రాష్ట్రంలో దోపిడీ కొనసాగుతుందని బ్రాండ్ పేరుతో కేజీ నుంచి పీజీ వరకు జరుగుతున్న విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. పేరెంట్స్ కమిటీలను ఏర్పాటు చేసి, ఫీజు రెగ్యులేటరీ కమిషన్‌ను నియమించాలని కోరారు. ఈ డిమాండ్లతో బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఏబీవీపీ తెలిపింది.

విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం నడుం బిగించిన వైసీపీ సర్కార్
ఇప్పటికే వైసీపీ సర్కార్ అనుమతులు లేని స్కూల్స్ ను సీజ్ చెయ్యాలని సూచించింది. అంతే కాకుండా నిబంధనలను పాటించని స్కూల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అందులో భాగంగా నారాయణ, చైతన్య వంటి విద్యా సంస్థలపైనే చర్యలు తీసుకుంది. ఇక నిబంధనలు పాటించకున్నా, అక్రమాలకూ పాల్పడినా ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది జగన్ సర్కార్ . విద్యా వ్యవస్థ ప్రక్షాళన చెయ్యాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రైవేట్ స్కూల్స్ లో దోపిడీకి చెక్ పెట్టటానికి ఫి రెగ్యులేటరీ కమీషన్ ను వెయ్యాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా అధికారులు కూడా రంగంలోకి దిగారు.
-
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
తమిళనాడులో రిచ్ అభ్యర్థి ఈమెనే! ఎవరీ లీమా రోజ్ మార్టిన్? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..! -
ఇరాన్ డెడ్ లైన్ పై ట్రంప్ మళ్లీ వెనక్కి ? అదే టర్నింగ్ పాయింట్..! -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
వేసవి సెలవులలో పిల్లలు ఆ పనిచేసే అవకాశం.. తల్లిదండ్రులు అలెర్ట్! -
Tamil Nadu Poll Survey: తమిళనాడులో షాకింగ్ ఫలితాలు-లోక్ పోల్ తుది సర్వేలో వారే క్లీన్ స్వీప్..! -
చందమామకు అవతలి వైపు అద్భుతం- సంపూర్ణ సూర్యగ్రహణం












Click it and Unblock the Notifications