టీటీడీపై నటి నమిత షాకింగ్ కామెంట్స్ .. టీటీడీ పని తీరుపై అసంతృప్తి
తమిళ్ హీరోయిన్ నమిత తాజాగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తిరుమల తిరుపతి దేవస్థానం పై షాకింగ్ కామెంట్ చేశారు. ఈరోజు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం సంతృప్తికరమైన దర్శనం కల్పించటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
గతంలో టిడిపి పాలన బాగుండేదని కానీ ఇప్పుడు టీటీడీలో ప్రస్తుత పరిపాలన ఏమాత్రం బాగోలేదని ఆమె వ్యాఖ్యలు చేశారు. గతంలో తిరుమలకు వచ్చినప్పుడు అప్పటి పరిపాలన బాగుందని, కానీ ప్రస్తుతం ఆ విధంగా లేదని నమిత వ్యాఖ్యానించారు. అప్పటి అధికారుల పని తీరుకు ఆమె కితాబిచ్చారు. ప్రస్తుతం పని తీరుపై అసహనం వ్యక్తం చేశారు. టిటిడి ఉద్యోగులంతా ప్రస్తుతం భయాందోళనలో ఉన్నట్టుగా నమిత అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో త్వరలో తను ప్రొడక్షన్ వర్క్ లోకి కూడా దిగుతున్నానని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

నమిత ప్రస్తుతం తాను నటిస్తున్న భౌ భౌ సినిమా షూటింగ్ పూర్తయిందని పేర్కొన్నారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో సినిమాను ఓటిటి లో రిలీజ్ చేయాలా లేకా థియేటర్లలో రిలీజ్ చేయాలా అని ఆలోచిస్తున్నామని చెప్పుకొచ్చారు. త్వరలోనే తాను ఒక ఓటీటీ యాప్ ను, ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభిస్తానని వెల్లడించారు. గతంలో ఆమె తెలుగులో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. నిర్మాతగా సినీ రంగంలో అడుగు పెట్టబోతున్న నమిత ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్టు సమాచారం. అయితే టిటీడీపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.












Click it and Unblock the Notifications