అవసరం లేకున్నాఅంత పెట్టి కొన్నారెందుకు?...విద్యుత్ కొనుగోళ్లపై సిఎస్ ఆగ్రహం

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఎప్పుడూ సౌమ్యంగా కనిపించే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ కు ఒక విషయమై కోపం వచ్చిందట. రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ ఉన్నప్పటికీ మన విద్యుత్ సంస్థలు ఎక్కువ ధర పెట్టి ప్రైవేట్‌ విద్యుత్‌ కంపెనీల నుంచి కరెంట్ కొనుగోళ్లు చేయడమే ఆయన ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది.

ఎపిలో మిగులు కరెంట్ పరిస్థితి ఉండటం...పైగా దేశంలో మిగతా చోట్ల కూడా విద్యుత్ కు పెద్దగా డిమాండ్ లోకపోయినా...ఏదో తీవ్రమైన పోటీ ఉన్నట్లు విద్యుత్ ను అత్యధిక ధరతో కొనుగోలుకు ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం చేసుకోవడంతో ఆయనకు చాలా ఆగ్రహం కలిగిందట. అందువల్ల ఈ విషయాన్ని చాలా సీరియస్ గా పరిగణించిన ఆయన దీనిపై పూర్తి సమాచారం ఇవ్వాల్సిందిగా సంబంధిత డిస్కమ్స్ అధికారులను ఆదేశించారట.

AP CS serious on Power Purchase Agreements

ఇప్పటికే ఎపి డిస్కమ్స్‌ ఏడాదికి 2,000 కోట్ల రూపాయలు నష్టాల్లోకి కూరుకుపోతున్నాయని, అలాంటి సమయంలో ఆచితూచి స్పందించాల్సింది పోయి ఇలా బాధ్యత లేకుండా వ్యవహరించడం ఏమిటంటూ ఆయన మండిపడ్డారట. విద్యుత్ డిమాండ్ లేని ఈ తరుణంలో కూడా ఎక్కువ ధర పెట్టి కొనుగోళ్లు జరపడం వల్లే డిస్కమ్స్‌పై పెనుభారం పడుతోందని సిఎస్ అన్నారట. ఈ నేపధ్యంలో ప్రస్తుత విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలన్నింటినీ తిరిగి సమీక్షించాలని సీఎస్‌ స్పష్టం చేసినట్లు తెలసింది. దీంతో ఈ ఒప్పందం లో కీలకంగా పనిచేసిన అధికారుల్లో ఆందోళన మొదలైందని అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Amaravathi: Andhra Pradesh chief secretary made clear to the Andhra Pradesh power DISCOMs, have decided to renegotiate power purchase agreements (PPAs) it had signed with power producers.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X