ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్- ఈ-ఎస్ఆర్ గడుపు పొడిగింపు..!

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల సర్వీస్ రికార్డుల్ని ఆన్ లైన్ చేస్తూ తీసుకొచ్చిన ఈ-ఎస్ఆర్ లో నమోదు చేసుకోవడం, వివరాలు అప్ డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువు ముగుస్తోంది. అయినా ఇంకా చాలా మంది ఉద్యోగులు ఈ ప్రక్రియ పూర్తి చేయలేకపోయారు. సర్వర్ సమస్యలు, ఇతరత్రా సమస్యల కారణంగా ఈ ప్రక్రియ అనుకున్న విధంగా ముందుకు సాగలేదు. దీంతో ఈ-ఎస్ఆర్ గడువు పొడిగించాలంటూ ప్రభుత్వానికి ఉద్యోగుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో గడువు పొడిగిస్తూ ప్రభుత్వం (AP Govt) ఇవాళ నిర్ణయం తీసుకుంది.

AP Govt: పంట నష్టపోయిన రైతులకు ఏపీ సర్కార్ పరిహారం- ఏయే పంటకు ఎలా?
AP Govt: పంట నష్టపోయిన రైతులకు ఏపీ సర్కార్ పరిహారం- ఏయే పంటకు ఎలా?

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ ఈరోజు సర్క్యులర్ మెమో జారీ చేసింది. ఇందులో ఉద్యోగుల సర్వీస్ రికార్డుల (e-SR) నమోదు, అప్‌డేట్ ప్రక్రియ గడువును నవంబర్ 30వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు తెలిపింది. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ ప్రక్రియను 31-10-2026 నాటికి పూర్తి చేసి, 01-11-2026 నుండి అన్ని సర్వీస్ వివరాలను e-SR లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. అయితే e-SR అప్లికేషన్‌లో సర్వర్ సమస్యలు, ఓటీపీ ధృవీకరణ వైఫల్యాలు వంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పాటు ఉద్యోగులు అవసరమైన సర్వీస్ రికార్డులు, సర్టిఫికెట్లు సమకూర్చుకోవడానికి సమయం పడుతోంది.

AP Govt Extends e-SR Registration Deadline to November 30 Over Technical Glitches
విశాఖ వైపు 17 రైళ్ల దారి మళ్లింపు-ఇచ్చాపురం-సోంపేట మధ్య ట్రాక్ పై నీరు..!
విశాఖ వైపు 17 రైళ్ల దారి మళ్లింపు-ఇచ్చాపురం-సోంపేట మధ్య ట్రాక్ పై నీరు..!

అలాగే కొందరు ఉద్యోగులు పంచాయతీ, పురపాలక ఎన్నికల విధుల్లో, రాష్ట్రపతి ఉత్తర్వుల కేటాయింపు ప్రక్రియల్లో నిమగ్నమై ఉన్నారు. దీంతో వీరంతా ఈ-ఎస్ఆర్ లో నమోదు లేదా అప్ డేట్ చేసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ ఈ-ఎస్ఆర్ గడువు పొడిగించాలని ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించింది. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం... ఉద్యోగులు, అన్ని శాఖలు e-SR కు సంబంధించిన పూర్తి ప్రక్రియను నవంబర్ 30లోగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
ఇకపై భవిష్యత్ సర్వీస్ ఈవెంట్లన్నింటినీ తప్పనిసరిగా సంబంధిత e-SR మాడ్యూల్స్ ద్వారా నమోదు చేయాల్సిన తేదీని డిసెంబర్ 1 వరకూ పొడిగించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+