సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!
వంట గ్యాస్ సరఫరా పైన ప్రభుత్వం నిరంతం సమీక్ష చేస్తోంది. గృహ వినియోగానికి గ్యాస్ సరఫరా లో ఇబ్బందులు లేకుండా పర్యవేక్షణ కొనసాగుతోంది. కమర్షియల్ సిలిండర్ల కొరత కారణంగా పలు ప్రాంతాల్లో హోటళ్లు మూసివేసారు. గృహ వినియోగానికి గ్యాస్ సరఫరాలో ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేందుకు గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఇక నుంచి ఖచ్చితంగా అమలు చేయాల్సిన విధానం పైన ప్రభుత్వం తాజా ఆదేశాలు ఇచ్చింది.
ఏపీలో వంట గ్యాస్ కొరత పైన ప్రభుత్వం నిరంతరం సమీక్ష చేస్తోంది. ఎక్కడా గృహ వినియోగానికి ఇబ్బంది లేకుండా చర్యలు సూచిస్తోంది. అందులో భాగంగా కేంద్రం నిబంధనల ప్రకారం గ్యాస్ బుకింగ్ చేయగానే ఓటీపీ వస్తుందని, నూటికి నూరు శాతం ఓటిపీ ఉంటేనే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి కేశవ్ వెల్లడించారు. దీంతో బ్లాక్ మార్కెట్ ను, అధిక ధరలు వసూళ్లు కు పాల్పడకుండా ఈ విధానం ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. గృహ వినియోగానికి సంబంధించిన వంట గ్యాస్‌పై యుద్ధ ప్రభావం ఏమాత్రం పడకుండా... సిలిండర్ల సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆస్పత్రులు, స్కూళ్లు, దేవాలయాలకు ఇబ్బంది రాకుండా నిరంతర సరఫరా ఉండాలని సూచించారు. గతంలో మాదిరిగానే బుక్ చేసిన ఒకటిన్నర రోజు ల్లోనే సిలిండర్ అందించగలిగితే... ప్రజల్లో గ్యాస్ సరఫరా విషయంలో ఆందోళన ఉండదని, ఎల్పీజీ సరఫరా విషయంలో ప్రజల్లో ఆందోళనలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలోని ఎల్పీజీ నిల్వలు, బుకింగ్, సరఫరా వంటి అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు.

ప్రభుత్వం సమీక్ష... సరఫరా పై కీలక చర్యలు
రాష్ట్రంలో ఎల్పీజీ నిల్వలు, సరఫరా వంటి అంశాలపై పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,209 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ స్టాక్ అందుబాటులో ఉందని ఉన్నతాధికారులు వివరించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ సంస్థలకు చెందిన 1154 ఏజెన్సీల నుంచి గ్యాస్ సరఫరా అవుతోందని అధికారులు వెల్లడించారు. ఎల్పీజీ సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. ప్రతి వినియోగదారు నుంచి ఓటీపీ తీసుకునే విధానాన్ని అవలంబించడం ద్వారా డొమొస్టిక్ సిలిండర్లు దుర్వినియోగం కాకుండా చూస్తున్నామని అధికారులు చెప్పారు. హెచ్‌పీసీఎల్ సంస్థ 90 శాతానికి పైగా ఓటీపీలతోనే గ్యాస్ సరఫరా చేస్తోందని, ఆ తర్వాత స్థానాల్లో బీపీసీఎల్, ఐఓసీఎల్ ఉన్నాయని అధికారులు తెలిపారు. ఓటీపీల విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే... స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల ద్వారా సమన్వయం చేసుకుంటూ ఆర్టీజీఎస్ నుంచి సాంకేతిక సాయాన్ని ఆయా గ్యాస్ సరఫరా కంపెనీలకు అందించే ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు. గ్యాస్ డెలివరి విషయంలో సిలిండర్లు దుర్వినియోగం కాకుండా టెక్నాలజీ ఉపయోగించి పని చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
-
జగన్ 'మావిగన్' ప్రతిపాదన వెనుక, కూటమి నేతలకు చంద్రబాబు కీలక పిలుపు..!! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
ఏపీలోని 13 కార్పోరేషన్లలో డివిజన్ల పెంపు-విజయవాడ, గుంటూరు సహా ఇవే..! -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
LPG: ఏపీలో వ్యాపారులకు ఊరట- కమర్షియల్ గ్యాస్ పై సర్కార్ ఉత్తర్వులు..! -
అమరావతి బిల్లు పై పార్లమెంట్ లో వైసీపీ బిగ్ ట్విస్ట్..!! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!! -
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
భారీ వర్షాలు, పిడుగులు, ఈదురు గాలులు - బీ అలర్ట్.. ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications