జిల్లాలు, మండలాల పునర్విభజనలో తాజా మార్పులు - :ఫైనల్ గా ఇలా..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలు.. డివిజన్లు.. మండలాల పునర్విభజన పైన స్వల్ప మార్పులకు సిద్దమైంది. ప్రజాభిప్రాయం సేకరించిన ప్రభుత్వం వారి నుంచి వచ్చిన స్పందన మేరకు కొత్త నిర్ణయాలు ఉండాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా గతంలో చేసిన ప్రతిపాదనలకు సవరణలు చేయనుంది. మరోసారి మంత్రివర్గం మార్పు చేసిన ప్రతిపాదనలతో ీ నెల 29న జరిగే మంత్రివర్గ భేటీలో నివేదిక ఇవ్వనుంది. దీని ఆధారంగా తుది నోటిఫికేషన్ జారీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది.
జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. గత నెల 27వ తేదీన జిల్లాల పునర్విభజనపై ప్రాథమిక నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై నెల రోజుల పాటు అభ్యంతారాలను స్వీకరించింది. అయితే ఈరోజు(శనివారం)తో గడువు ముగుస్తోంది. ప్రాథమిక నోటిఫికేషన్ అనంతరం వ్యక్తమైన అభ్యంతరాలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఏపీ వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు రాగా... వాటిని పరిశీలించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. మార్పులు, చేర్పుల తర్వాత డిసెంబర్ 31వ తేదీన తుది నోటిఫికేషన్ ఇవ్వనుంది ప్రభుత్వం.

జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజంపేటను కడపలో కలిపి, రాయచోటిని మదనపల్లిలో కలిపే ప్రతిపాదనలపై ప్రభుత్వం కీలక సమాలోచనలు చేసింది. ఇప్పటికే ప్రకటించిన మూడు జిల్లాలతో 29 వరకు జిల్లాల సంఖ్య పెరగాల్సి ఉంది. తాజా ప్రతిపాదనలతో 28 జిల్లాలకే పరిమితం చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గూడూరు ప్రజల అభిప్రాయం మేరకు గూడూరు నియోజకవర్గంలోని 5 మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కలపాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. అలాగే రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో, రాయచోటిని మదనపల్లి జిల్లాలో, రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్టను కడప జిల్లాలో విలీనం చేయాలన్న అంశంపైనా చర్చ జరిగింది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
కాగా.. విస్తీర్ణ పరంగా పెద్దదైన ఆదోనిని రెండు మండలాలుగా విభజించాలనే అభిప్రాయానికి వచ్చారు. మరోవైపు, అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి డివిజన్ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. మునగపాకను అనకాపల్లి డివిజన్లోనూ, అచ్యుతాపురంను అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్లో చేర్చాలని సమావేశంలో నిర్ణయించారు. కాగా, రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటుకానున్న పోలవరం జిల్లాలో ఎటువంటి మార్పు లేదు.
-
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
ఏపీలోని 13 కార్పోరేషన్లలో డివిజన్ల పెంపు-విజయవాడ, గుంటూరు సహా ఇవే..! -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
అమరావతి బిల్లు పై పార్లమెంట్ లో వైసీపీ బిగ్ ట్విస్ట్..!! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
అమరావతిపై జగన్ ప్లాన్ 'బీ' - కొత్త రాజధాని “మావిగన్”..!! -
అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!! -
అమరావతిపై జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్.. అంగుళం కూడా కదల్చలేవ్ -
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..! -
భారీ వర్షాలు, పిడుగులు, ఈదురు గాలులు - బీ అలర్ట్.. ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications