'బాబూ! రాజీనామా చెయ్, జేసీ చెప్పారుగా, ఇంకా ఆందోళనా', అల్లకల్లోలం చేసేందుకే: విష్ణు షాకింగ్

Posted By:
Subscribe to Oneindia Telugu

అనంతపురం: ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆందోళనలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి మంగళవారం గట్టి కౌంటర్ ఇచ్చారు. టీడీపీ ఇక్కడ ఆందోళనలు ఎందుకు చేస్తోందని ఆయన ప్రశ్నించారు.

చదవండి: హోదా కాకపోయినా నిధులు, జనసేనలోకి రమ్మంటే నో చెప్పా: జేసీ సంచలనం, పవన్ ఆపరేషన్?

టీడీపీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఓ వైపు ఎంత ఆందోళన చేసినా ప్రత్యేక హోదా రాదని చెబుతారని, చంద్రబాబు చెప్పారు కాబట్టి చేస్తున్నామని అంటున్నారని, అలాంటప్పుడు ఆ పార్టీ రాష్ట్రంలో ఆందోళనలు ఎందుకు నిర్వహిస్తుందో చెప్పాలని ప్రశ్నించారు.

చదవండి: ఒక్క దెబ్బకు 3 పిట్టలు!: కార్నర్ చేసేందుకు చంద్రబాబు 'వీడియో' ప్లాన్

చంద్రబాబు రాజీనామా చేయాలి

చంద్రబాబు రాజీనామా చేయాలి

ప్రత్యేక హోదా పైన తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి లేదని అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. అందుకు జేసీ వ్యాఖ్యలే నిదర్శనం అని అభిప్రాయపడ్డారు. విభజన హామీలు, హోదాపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని సరికొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు.

వైసీపీ ఎంపీలపై జేసీ

వైసీపీ ఎంపీలపై జేసీ

ఢిల్లీలో వైసీపీ ఎంపీలు చేస్తున్న విమర్శలపై జేసీ తీవ్రంగా మండిపడ్డారు. అవి దొంగ దీక్షలు అని, మూడ్రోజులు దీక్ష చేస్తే పోలీసులు వచ్చి తీసుకు వెళ్తారని, ఇదేనా దీక్ష అని, ఆమరణ దీక్ష చేసింది ఒకే ఒక్కడు మనవాడు, తెలుగువాడు పొట్టి శ్రీరాములు మాత్రమేనని జేసీ అన్నారు. వైసీపీ ఎంపీలు మూడ్రోజులు దీక్షచేయగానే సరిపోతుందా అని అభిప్రాయపడ్డారు.

మర్యాద నిలబెట్టుకోవాలి

మర్యాద నిలబెట్టుకోవాలి

దీనిపై అనంత వెంకట్రామి రెడ్డి స్పందిస్తూ.. తమ ఎంపీల దీక్షను అవహేళన చేయడం జేసీకి సరికాదన్నారు. ఆయన వయస్సుకు తగిన, ఆయన హోదాకు తగిన మాటలు మాట్లాడాలని సూచించారు. అలా మాట్లాడి మర్యాద నిలుపుకోవాలన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని హితవు పలికారు.

చంద్రబాబుపై విష్ణు కుమార్ తీవ్ర వ్యాఖ్యలు

చంద్రబాబుపై విష్ణు కుమార్ తీవ్ర వ్యాఖ్యలు

ఏపీ సీఎం చంద్రబాబుపై బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నిజాలు మాట్లాడాలన్నారు. డబుల్ స్టాండర్డ్ ప్లే మంచిది కాదని హితవు పలికారు. యూటర్న్ తీసుకున్న సీఎంగా చంద్రబాబు పేరు సంపాదించారన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress party leader Anantha Venkatarami Reddy slams MP JC Diwakar Reddy and Telugudesam Party.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X