చెవిరెడ్డి అరెస్ట్‌కు అనుమతి తీసుకున్నారా?: పోలీసుల తీరుపై చంద్రబాబు!

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: ఏపీ అసెంబ్లీ గేట్ ముందు ఆందోళనకు దిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకొని, ఆరు గంటల అనంతరం విడుదల చేశారు. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు.

అసెంబ్లీ ఆవరణలో చెవిరెడ్డి దీక్ష చేయడం తప్పని చెప్పారు. అయితే, చెవిరెడ్డిని అదుపులోకి తీసుకునే ముందు స్పీకర్, చీఫ్ విప్ అనుమతి తీసుకుని ఉండాల్సిందని ముఖ్యమంత్రి ఆగ్రహించారని తెలుస్తోంది.

chevireddy bhaskar reddy

అసెంబ్లీ నియమ నిబంధనల గురించి పోలీసులు తెలుసుకుని ఉంటే బాగుండేదన్నారు. అంతేకాకుండా, పోలీసు అధికారుల సంఘాన్ని 'తొక్కలో సంఘం' అంటూ చెవిరెడ్డి వ్యాఖ్యలు చేయడాన్ని స్ట్రాటజీ కమిటీతో పాటు చంద్రబాబు తప్పుబట్టారు. 44 కేసులు ఉన్న చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సబబు కాదన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP CM Chandrababu Naidu on monday responded on YSR Congress Party MLA Chevireddy Bhaskar Reddy.
Please Wait while comments are loading...