వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు ఎంపీలతో చంద్రబాబు కీలక భేటీ: వీటిపైనే ప్రధాన చర్చ, వైసీపీపైనా..

|
Google Oneindia TeluguNews

అమరావతి: మార్చి 5 నుంచి రెండో విడత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం పార్టీ ఎంపీలతో తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు.

శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని సీఎం నివాసంలోని గ్రీవెన్స్‌ హాలులో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంట్‌ సమావేశాల్లో టీడీపీ అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.

 మరోసారి ఒత్తిడి పెంచే అవకాశం

మరోసారి ఒత్తిడి పెంచే అవకాశం

ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై టీడీపీ ఎంపీలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. విభజన హామీల సాధనకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పార్లమెంట్‌ బయట, లోపలా ఆందోళన చేపట్టారు. ఇప్పుడు మరోసారి అదే విధానాన్ని కొనసాగేంచే అవకాశంపై చర్చించనున్నారు.

Recommended Video

Chandrababu Naidu Warning to YS Jagan Over Investments
ఇతర పార్టీల విధానాలపైనా

ఇతర పార్టీల విధానాలపైనా

కాగా, బడ్జెట్‌ సమావేశాలు వాయిదా పడినందున ఆ పోరాటానికి తాత్కాలికంగా విరామం వచ్చింది. అయితే, మళ్లీ మార్చి 5 నుంచి సమావేశాలు జరగనున్నందున విభజన హామీలతో పాటు రాష్ట్రానికి ప్రకటించిన హామీలన్నింటినీ సాధించేందుకు కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాలని, రాష్ట్ర హక్కుల సాధన, వివిధ పార్టీలు అనుసరిస్తున్న విధానంపైనా చర్చించే అవకాశం ఉంది.

 ఏ త్యాగానికైనా సిద్ధమని..

ఏ త్యాగానికైనా సిద్ధమని..

రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే రాజీనామాలకు కూడా వెనుకాడబోమని, ఏ త్యాగానికైనా సిద్ధమని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

 ముందుకు ఎలా?

ముందుకు ఎలా?

ఎంపీలతో రాజీనామాతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై అవిశ్వాసం పెడతామని ప్రకటించిన నేపథ్యంలో ఆ అంశంపైనా ఈ కీలక భేటీలో చర్చించే అవకాశం ఉంది. వీటన్నింటి నేపథ్యంలో ఏవిధంగా ముందుకెళ్లాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

English summary
Andhra Pradesh CM and TDP president Chandrababu Naidu will meets his party mps on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X