కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిక్కెట్ చిచ్చు: అధ్యక్షుడా.. లోకేష్‌పై టీజీ తీవ్రవ్యాఖ్యలు! అందుకే జగన్‌కు దూరం: బుట్టా రేణుక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

నారా లోకేష్ పై తెలుగుదేశం పార్టీ నేతలు ధ్వజం

కర్నూలు: ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను మంత్రి నారా లోకేష్ ప్రకటించడంపై రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ బుధవారం స్పందించారు. ప్రకటన చేసేందుకు లోకేష్ పార్టీ అధ్యక్షులు కాదని వ్యాఖ్యానించారు. లోకేష్ నేతలను ప్రకటించడం పెద్ద దుమారమే రేపుతోంది. ఆయన కర్నూలులో మీడియాతో మాట్లాడారు.

భరత్ హంగామా, అంతలోనే: టీజీకి లోకేష్ ఊహించని షాక్, వైసీపీ వాళ్లకే!భరత్ హంగామా, అంతలోనే: టీజీకి లోకేష్ ఊహించని షాక్, వైసీపీ వాళ్లకే!

లోకేష్ కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా బుట్టా రేణుక, ఎస్వీ మోహన్ రెడ్డిలను ప్రకటించడం షాక్‌కు గురి చేసిందని చెప్పారు. అయినా లోకేష్ పార్టీకి అధ్యక్షుడు కాదని చెప్పారు. అంతేకాకుండా అధికార కార్యక్రమంలో అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారో చెప్పాలని నిలదీశారు. బహుషా లోకేష్‌ను ఎస్వీ మోహన్ రెడ్డి హిప్నటైజ్ చేశారేమో అన్నారు.

కర్నూలు అభ్యర్థులుగా బుట్టా, ఎస్వీలను ప్రకటించిన లోకేష్: పవన్‌కు కౌంటర్కర్నూలు అభ్యర్థులుగా బుట్టా, ఎస్వీలను ప్రకటించిన లోకేష్: పవన్‌కు కౌంటర్

Chinnababu stokes internal fight in Kurnool TDP

టీజీ వెంకటేష్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఎస్వీ మోహన్ రెడ్డి చెప్పారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ అభ్యర్థులను ప్రకటించారని చెప్పారు. టీజీ వెంకటేష్‌కు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన సమయంలో తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చేలా ఒప్పందం ఉందని చెప్పారు. ఎన్నికలకు ముందే అభ్యర్థులను ప్రకటించాలని లేదన్నారు.

Chinnababu stokes internal fight in Kurnool TDP

అందుకే వైసీపీని వీడా: బుట్టా రేణుక

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే జోన్‌ విషయంలో రాష్ట్ర ప్రజలను బీజేపీ అవమానిస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కొన్ని అంశాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నందునే వైసీపీకి దూరమైనట్లు తెలిపారు. స్థానిక నేతలతో తనకు ఎలాంటి పొరపొచ్చాలు లేవన్నారు.

English summary
Kunrool politics is once again hotting up. Groupism in the ruling Telugu Desam Party is likely to intensify. The reason for this is Chief Minister Chandrababu's son and minister Nara Lokesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X