Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ కు తెలిసింది దోపిడీ చెయ్యటం, దొంగల్ని చేరదీయటం: విరుచుకుపడిన చింతమనేని ప్రభాకర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్ టైం సెటిల్మెంట్ పై రచ్చ కొనసాగుతూనే ఉంది. అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఓటీఎస్ ఒక మంచి పథకం అని వైసీపీ ప్రచారం చేస్తూ దాని వల్ల లాభం కలుగుతుంది అని చెప్తుంటే, వైసీపీ చేస్తుంది బలవంతపు వసూళ్లు అని, దాని వల్ల నష్టం జరుగుతుంది అని టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు ప్రతివిమర్శలు చేస్తున్నారు. వైసీపీ మంత్రులు, ముఖ్యమంత్రి ఓటీఎస్ పై ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చినా సరే టీడీపీ నేతలు ఓటీఎస్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటీఎస్ రద్దు కోసం ఆందోళనలు చేస్తున్నారు.

ఏలూరులో ఓటీఎస్ రద్దు కోసం టీడీపీ ఆందోళనలు

ఏలూరులో ఓటీఎస్ రద్దు కోసం టీడీపీ ఆందోళనలు

సోమవారం నాడు ఏలూరు పట్టణం తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసనలతో అట్టుడుకుతోంది. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏలూరు పట్టణంలో కలెక్టరేట్ వద్ద టిడిపి నాయకులు కార్యకర్తలు భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వన్ టైం సెటిల్మెంట్ పథకంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న నిరసనలలో భాగంగా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓటిఎస్ ను రద్దు చేయాలని, ప్రజల మెడలకు ఉరితాడు బిగించవద్దని ఆందోళనలు చేశారు.

జగన్ కు తెలిసింది దోపిడీ చెయ్యటమే అన్న చింతమనేని ప్రభాకర్

జగన్ కు తెలిసింది దోపిడీ చెయ్యటమే అన్న చింతమనేని ప్రభాకర్

ఈ సందర్భంగా మొదట కలెక్టరేట్ ముందు బ్యానర్ లతో బైటాయించిన ఆయన మౌనంగా ఆందోళన చేశారు . ఆ తర్వాత శ్రేణులతో కలిసి సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు . రాష్ట్రాన్ని పరిపాలించే సత్తా జగన్ కు లేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. జగన్ కు తెలిసిందల్లా ఒక్కటే దోపిడీ చేయడం అని, దొంగల్ని చేరదీయడం అని చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. అన్ని వర్గాల వారిని జగన్ దోపిడీ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఓటిఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్ కాదని మండిపడ్డారు.

ఒక్కసారి జగన్ దోపిడీ అంటూ ఓటీఎస్ పై ఎద్దేవా

ఒక్కసారి జగన్ దోపిడీ అంటూ ఓటీఎస్ పై ఎద్దేవా

జగన్ సర్కార్ తీసుకువచ్చిన ఓటిఎస్ పథకానికి కొత్త పేరు పెట్టారు. ఒక్కసారి జగన్ దోపిడి అంటూ ఓజెడి అంటూ ఎద్దేవా చేశారు. జగనన్న గృహ నిర్మాణ పథకం అంటూ తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పథకం పేరుతో సెటిల్మెంట్లకు దిగుతున్నారని మండిపడ్డారు .పేదవారికి గృహ హక్కులు కల్పిస్తామంటూనే దోచుకుంటున్నారు అంటూ నిప్పులు చెరిగారు చింతమనేని ప్రభాకర్. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పైసా ఖర్చు లేకుండా లబ్ధిదారులకు గృహ హక్కులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

 ఆ రోజులు వస్తాయి.. ఆందోళన వద్దు

ఆ రోజులు వస్తాయి.. ఆందోళన వద్దు

అధికారులు, వాలంటీర్లు చెప్పే మాటలను విని వారికి భయపడి లబ్ధిదారులు లొంగి ఓటిఎస్ ఒప్పుకోవద్దని చింతమనేని ప్రభాకర్ సూచించారు తెలుగుదేశం అధికారంలోకి వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. ఓటిఎస్ బాధితులు ఆందోళన చెందవద్దని, తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంటుందని చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం టీవీ ఛానల్స్ పెట్టుకున్నారని చింతమనేని ప్రభాకర్ ధ్వజమెత్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+