సీఎం జగన్ హిట్ లిస్టులో ఉన్న ఆ 38 మంది ఎవరు - సర్వేలు తేల్చిందేంటి..!?

ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పేసారు. చివరి అవకాశం ఇచ్చారు. పని తీరు మెరుగుపర్చుకోవాలని స్పష్టం చేసారు. ఎవరినీ వదులుకోవాలని తాను అనుకోవటం లేదన్నారు. నిర్దేశించిన గడువు లోగా పని తీరు మెరుగుపర్చకుంటే ప్రత్యామ్నాయం తప్పదని స్పష్టం చేసారు. ఏప్రిల్ నుంచే టికెట్లు ప్రకటన ఉంటుందని ప్రకటించారు.

మొత్తం 38 మంది తన అంచనాలకు దూరంగా ఉన్నారని తేల్చారు. ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి సర్వే నివేదికలను బయట పెట్టారు. సీఎం ప్రస్తావించిన 38 మందిలో మంత్రులు కూడా ఉన్నారు. సీఎం వద్దకు చేరిన సర్వేల్లో పనితీరులో తొలి స్థానంలో ఉన్నదెవరు.. ఈ 38 మందిలో ఎవరున్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి సీఎం తేల్చి చెప్పిందేంటి.

క్యాస్ట్ వార్ కాదు.. జరిగేది క్లాష్ వార్

క్యాస్ట్ వార్ కాదు.. జరిగేది క్లాష్ వార్

ముఖ్యమంత్రి జగన్ పార్టీ సమావేశంలో వచ్చే ఎన్నికలకు సంబంధించి స్పష్టత ఇచ్చారు. జరిగేది క్యాస్ట్ వార్ కాదన్నారు. పేదలకు - పెత్తందార్లకు మధ్య యుద్దంగా అభివర్ణించారు. పేదల తరపున వైసీపీ నిలబడిందని.. పెత్తందార్లకు ప్రతిపక్షాలు మద్దతిస్తున్నాయన్నారు. పొరపాటున తాము తిరిగి అధికారంలోకి రాకపోతే పేదలకు మేలు జరగదన్నారు.

గడప గపడకు ప్రభుత్వం కార్యక్రమం ఎమ్మెల్యేల కోసమేనని స్పష్టం చేసారు. ప్రతీ ఇంట్లో అయిదు నిమిషాలు కేటాయించి..వారితో మమేకం కావాలని సూచించారు. ఎన్ని గడపలు పూర్తి చేసామనే లెక్కల కంటే.. ఎంత నాణ్యతతో పని చేస్తున్నామనేది ముఖ్యమని నిర్దేశించారు. తాను ఎవరినీ వదులుకోవాలని అనుకోవటం లేదన్నారు.

పని తీరు మెరుగు పరచుకొనేందుకు మార్చి వరకు సమయం ఇచ్చారు. మరోసారి మార్చి 17న పార్టీ వర్క్ షాపు జరుగుతుందని చెప్పారు. అప్పటికీ ఇప్పుడు చెబుతున్న వారిలో పని తీరు మెరుగు కాకుంటే..ప్రత్యామ్నాయం వైపు చూడక తప్పదని స్పష్టం చేసారు. ఏప్రిల్ నుంచి అభ్యర్ధుల ప్రకటన ఉంటుందని ప్రకటించారు.

తొలి స్థానంలో ఎవరు - లిస్టులో ఉన్న మంత్రులెవరు

తొలి స్థానంలో ఎవరు - లిస్టులో ఉన్న మంత్రులెవరు

గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మం చేయ‌డంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డికి ఫ‌స్ట్ ప్లేస్ వ‌చ్చింది. ఎమ్మెల్యేను సీఎం జగన్ అభినందించారు. గడప గడప వర్క్ షాపుకు ఆయన హాజరు కాలేదు. సీఎం అనుమతితోనే రాచమల్లు హాజరు కాలేదు. సార్వత్రిక ఎన్నికల వ్యూహంలో భాగంగా ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు కూడా ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలని జగన్‌ సూచించారు.

జనవరిలో అందించే జగనన్న భరోసా కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా పాల్గొనాలని నిర్దేశించారు. గడప గడపకూ మన ప్రభుత్వం'లో ఏకంగా 64 మంది ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో పాల్గొనలేదని వెల్లడించారు. 38 మంది పేర్లను చదివి వినిపించారు. మంత్రుల గురించి ప్రస్తావించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి, మేరుగ నాగార్జున, విడదల రజని, చెల్లుబోయిన, జోగి రమేశ్‌, కారుమూరి నాగేశ్వరరావు, ధర్మాన ప్రసాదరావు, గుమ్మనూరు జయరాం, సీదిరి అప్పలరాజు పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

ఇక... మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, మేకతోటి సుచరిత, బాలినేని పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి.

30 మంది ఎమ్మెల్యేలు - డెడ్ లైన్ ఫిక్స్

30 మంది ఎమ్మెల్యేలు - డెడ్ లైన్ ఫిక్స్

సర్వే సంస్థలు అందించిన నివేదికల ప్రచారం మంత్రులు ఎనిమిది మంది.. 30 మంది ఎమ్మెల్యేలు సీఎం అంచనాలకు దూరంగా ఉన్నారు.పెట్ల ఉమాశంకర గణేష్, శ్రీనవాస నాయుడు, ఎలీజా, పొన్నాడ సతీష్, వసంత క్రిష్ఱ ప్రసాద్, మేకా ప్రతాప్ అప్పారావు, ముస్తఫా, ఉండవల్లి శ్రీదేవి, మద్దిశెట్టి వేణుగోపాల్, మహీధర్ రెడ్డి, మధుసూధన యాదవ్, సంజీవయ్య, పెద్దిరెడ్డి ద్వారకానాధ్ రెడ్డి, చింత రామచంద్రారెడ్డి, మేడా మల్లి ఖార్జున రెడ్డి, ఎస్ రఘురామి రెడ్డి, వై సాయిప్రసాద రెడ్డి, చెన్న కేశవ రెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి ఉన్నారు.

మండపేట, హిందూపురం, విశాఖ పశ్చిమం, విశాఖ ఉత్తరం, రాజమండ్రి నగరం నియోజకవర్గాల ఇంఛార్జ్ లు ఈ జాబితాలో ఉన్నారు. వీరందరికీ మార్చ 17వ తేదీన మరోసారి జరిగే సమావేశం వరకు సీఎం జగన్ డెడ్ లైన్ నిర్దేశించారు.

దీంతో, మరి ఇప్పుడు వీరంతా పని తీరు మెరుగుపర్చుకొనేందుకు శ్రమించాల్సి ఉంది. దీంతో, వచ్చే సమావేశం నాటికి వీరిలో ఎంత మంది టికెట్ పొందే జాబితాలో ఉంటారు.. ముఖ్యమంత్రి నిర్ణయం ఎలా ఉంటుందనేది ఇప్పుడు పార్టీలో ఉత్కంఠకు కారణమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+