అగ్రిగోల్డ్ బాధితులకు నగదు జమ-దేశ చరిత్రలోనే ఇలా ఆదుకున్న దాఖలా ఎక్కడా లేదు- సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం నగదు జమ చేసింది. రూ.10 వేలలోపు అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు రూ.207.61 కోట్లు, రూ.20 వేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు రూ.459.23 కోట్ల నగదు చెల్లింపులు జరిపింది. మొత్తం రూ.666.84 కోట్లతో దాదాపు 7 లక్షలకు పైగా అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం చెల్లింపులు జరిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన నగదు మొత్తాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉంటామని పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేశామన్నారు. అగ్రిగోల్డ్‌ స్కామ్‌కు కర్త, కర్మ, క్రియ అన్నీ గత ప్రభుత్వమేనని ఆరోపించారు. చిన్న చిన్న వ్యాపారులు చేసుకునే కష్ట జీవులను సైతం టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ యాజమాన్యంతో కుమ్మక్కయిందని ఆరోపించారు. ఈ స్కామ్ గత ప్రభుత్వం చేత, గత ప్రభుత్వంలోని మనుషుల కోసం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో ఉన్నవారికి ఇందులో హస్తం ఉందన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేసేందుకు ఎవరు ప్రయత్నించారో అందరికీ తెలుసన్నారు.

cm ys jagan releases money to agri gold victims and alleges tdp govt cheated the victims

ప్రైవేట్ సంస్థ చేతిలో మోసపోయిన బాధితులను ఇలా ప్రభుత్వం ఆదుకున్న దాఖలాలు దేశ చరిత్రలో ఎక్కడా లేవన్నారు. కష్టపడి సంపాదించుకున్న‌ సొమ్మును అగ్రిగోల్డ్‌లో పొదుపు చేసి ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు నష్టపోయారని చెప్పారు.పేద ప్రజల కోసం ప్రభుత్వం దీన్ని బాధ్యతగా తీసుకుని.. వారికి రావాల్సిన సొమ్మును చెల్లించిందన్నారు. ఇందుకోసం ఇంటింటికీ వెళ్లి బాధితులను గుర్తించామన్నారు. గతంలో సీఐడీ ద్వారా వివరాలు సేకరించినా.. మరోసారి వాలంటీర్లు, సచివాలయాల ద్వారా మరింత మంది వివరాలు సేకరించి వారికి న్యాయం చేస్తున్నామని చెప్పారు. కోర్టు కేసులు కొలిక్కి వచ్చాక ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించి... ఆ డబ్బుతో మిగతా బాధితులకు నగదు చెల్లిస్తుందని తెలిపారు.

అగ్రిగోల్డ్ బాధితులకు రూ.785 కోట్లు చెల్లించాలని నిర్దారించిన ఏపీ ప్రభుత్వం.. ఒక్క రూపాయి కూడా బాధితులకు ఇవ్వలేదన్నారు. ఎన్నికలకు రెండు నెలల ముందు డబ్బులు చెల్లిస్తామని జీవో ఇచ్చి వారిని మోసం చేసిందన్నారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక... మొదటి విడతలో 2019 నవంబర్‌లోనే 3.40 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు రూ.238.73 కోట్లు చెల్లించామన్నారు. తాజాగా ఇచ్చిన రెండో విడతతో కలిపి మొత్తం 10లక్షల 45వేల కుటుంబాలకు రూ.905.57 కోట్లు నగదు జమ చేశామని తెలిపారు. అగ్రిగోల్డ్‌ వ్యవహారం కొలిక్కి రాగానే మిగిలిన డిపాజిటర్లకు కూడా చెల్లింపులు జరుపుతామన్నారు.

ఇదే అంశంపై సోమవారం వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ... చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ సంస్థకు అనుమతులు వచ్చాయని... ఆయన హయాంలోనే ఆ సంస్థ బోర్డు తిప్పేసిందని గుర్తుచేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను టీడీపీ నేతలే దోచుకున్నారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ అక్రమాలకు ప్రధాన సూత్రధారి చంద్రబాబే అని ఆరోపించారు. మధ్యతరగతి ప్రజలు తీవ్ర మనోవేదనకు గురిచేశారని... 300 మంది బాధితుల ఆత్మహత్యలకు కారకుడయ్యారని విమర్శించారు. పాదయాత్ర సమయంలోనే జగన్ అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పటికే రూ.10వేల లోపు డిపాజిట్ దారులకు డబ్బులు చెల్లించామని... ఈ నెల 24న రూ.20వేల లోపు బాధితులకు చెల్లింపులు జరుపుతున్నామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+