తండ్రి మృతదేహం వద్ద అవినాశ్ మోకరిల్లి.. కంటతడి పెట్టించాడు
మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత దేవినేని నెహ్రూ అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో మంగళవారం నిర్వహించారు.
విజయవాడ: మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత దేవినేని నెహ్రూ అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో మంగళవారం నిర్వహించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు, పలువురు మంత్రులు, నేతలు పెద్దయెత్తున నెహ్రూ అంతిమ యాత్రలో పాల్గొని నివాళులర్పించారు.

విజయవాడ గుణదలలోని నెహ్రూ స్వగృహం నుంచి నున్న మార్కెట్‌కు వెళ్లే దారిలో ఉన్న వ్యవసాయ భూమి వరకు అంతిమయాత్ర కొనసాగింది.
నెహ్రూ కుమారుడు అవినాశ్ కడసారి తండ్రి పార్థివదేహంపై మోకరిల్లి బోరున విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది. అనంతరం అవినాశ్ తండ్రికి అంతియ సంస్కారాలు నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాల్లో భాగంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.












Click it and Unblock the Notifications