జగన్‌కు షాక్: అక్కడ వైసిపిలో విభేదాలు, టిక్కెట్‌పై తెరపైకి కొత్త వాదన
ఉరవకొండ వైసిపిలో వర్గపోరు ప్రారంభమైంది. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో విశ్వేశ్వర రెడ్డి పైన ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఉరవకొండ: ఉరవకొండ వైసిపిలో వర్గపోరు ప్రారంభమైంది. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో విశ్వేశ్వర రెడ్డి పైన ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఉరవకొండ వైసీపీ నేతలు రెండు గ్రూపులుగా చీలిపోయారు. తాజాగా ఓ వర్గానికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో పరిస్థితి మరింత వేడెక్కింది. ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డికి వ్యతిరేకంగా కొందరు ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గ్రూప్
ఉరవకొండ నుంచి గత ఎన్నికల్లో విశ్వేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అప్పుడు ఆయన విజయానికి మాజీ ఎమ్మెల్సీ శివరామి రెడ్డి కృషి చేశారు. అయితే క్రమంగా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా శివరామి రెడ్డి వర్గీయులు గ్రూపుగా ఏర్పడినట్లుగా విమర్శలు వచ్చాయి.

ముగ్గురికి వ్యతిరేకంగా గ్రూప్
రెండు రోజుల క్రితం ఆదివారం వైయస్సార్ కుటుంబ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దీనిని ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా వైరి వర్గం నిర్వహించిందని అంటున్నారు. అందులో శివరామి రెడ్డి వర్గీయులు ఉన్నారు. దీనిని వైసీపీ జిల్లా నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ సమావేశానికి హాజరైన శివరామిరెడ్డి అనుచరుల్లో ముగ్గురికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

టిక్కెట్ పైన తెరపైకి కొత్త వాదన
దీంతో శివరామిరెడ్డి వర్గీయులు గుర్రుగా ఉన్నారు. మంగళ వారం షోకాజ్ నోటీసులు అందుకున్న వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. వైసీపీ శ్రేణులకు దగ్గరగా ఉండే నాయకులకే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వాలనే వాదన తెరపైకి తెచ్చారు. పైరవీలు చేసి అనవసరంగా పెత్తనం చలాయించే నేతలను దూరం పెట్టాలని ఎమ్మెల్యేను ఉద్దేశించి అన్నారు.

టీడీపీతో చర్చలు జరిపిన వారికి కాకుండా మాకు నోటీసులా
ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి కొందరికే ప్రాధాన్యత ఇస్తున్నారని వారు విమర్శించారు. పార్టీ మారాలనుకొని టిడిపి నేతలను కలిసిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేయకుండా తమకు ఇవ్వడం ఏమిటని నిలదీశారు. అంతేకాదు, విశ్వేశ్వర్ రెడ్డికి దగ్గరగా ఉంటున్న వారు కూడా మరికొందరు శివరామిరెడ్డి వర్గంలో చేరారనే వాదనలు వినిపిస్తున్నాయి.

వీరిలో టిక్కెట్ ఎవరికి
గుంతకల్లు నుంచి గతంలో పోటీ చేసి ఓడిన వెంకట్రామి రెడ్డి మళ్లీ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఈయన శివరామిరెడ్డి సోదరుడు. అలాగే ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగి రెడ్డిలు అంతా బంధువులు. ఈ నలుగురు బంధువులు కావడంతో వచ్చే ఎన్నికల్లో వీరికి ఎవరికి టిక్కెట్ ఇస్తారనే చర్చ సాగుతోంది. కాగా, ఉరవకొండలో గత ఎన్నికల్లో విశ్వేశ్వర్ రెడ్డి విజయానికి సహకరించిన శివరామి రెడ్డి ఇప్పుడు టిక్కెట్ రేసులో ఉండటం గమనార్హం.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్












Click it and Unblock the Notifications