ఏపీలో విపరీతంగా పెరిగిన విద్యుత్ వినియోగం.. యుద్ధమే కారణం.. ఎలాగంటే!
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పైన పడింది. మన భారతదేశంలోని అనేక రంగాలు ప్రభావితం అవుతున్నాయి. ప్రస్తుతం ఈ యుద్ధ ప్రభావం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పైన స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊహించని విధంగా విద్యుత్ వినియోగం పెరిగింది.
ఏపీలో గ్యాస్ కొరత , బాగా పెరిగిన ఇండక్షన్ స్టవ్, ఎలెక్ట్రిక్ కుక్కర్ల వినియోగం
ఈ విద్యుత్ వినియోగానికి యుద్ధమే కారణమని తెలుస్తోంది. అసలు యుద్ధానికి విద్యుత్ వినియోగానికి లింక్ ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీకోసమే..పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత నెలకొంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గ్యాస్ కొరత ప్రధానంగా కనిపిస్తుంది. దీంతో ఏపీలో ప్రజలు వంట గ్యాస్ కు బదులుగా ఇండక్షన్ స్టవ్ లు, ఎలక్ట్రిక్ కుక్కర్ల వాడకాన్ని బాగా పెంచారు.

బాగా నమోదవుతున్న విద్యుత్ వినియోగం
దీంతో విద్యుత్ వినియోగం బాగా పెరిగింది అసలే ఎండాకాలం కావడంతో ఇప్పటికే కూలర్లు, ఏసీలు వినియోగిస్తున్న వారి సంఖ్య పెరిగింది. ఇక గ్యాస్ కొరత నేపథ్యంలో, చాలామంది గ్యాస్ పైన కాకుండా ఇండక్షన్ స్టవ్ ల పైన, ఎలక్ట్రిక్ కుక్కర్ల లోను వంటను ఎక్కువగా చేస్తూ ఉండడంతో రాష్ట్రంలో మరింత విద్యుత్ డిమాండ్ పెరిగింది. మార్చి 7వతేదీన రికార్డుస్థాయిలో 274. 6మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఏపీలో నమోదయింది.
విద్యుత్ వినియోగం పెరగటానికి యుద్ధం కారణం
గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి విద్యుత్ వినియోగం 9.15శాతం అధికంగా ఉంది. మార్చి 12 ,13, 14తేదీలలో కూడా వరుసగా సుమారు 272 మిలియన్ యూనిట్ల డిమాండ్ నమోదు అయినట్టుగా అధికారులు చెబుతున్నారు. పెరిగిన విద్యుత్ వినియోగానికి గ్యాస్ కొరత కారణంగా చెబుతున్నారు. ఈ గ్యాస్ కొరతకు యుద్ధం కారణమని అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే ఏపీలో విద్యుత్ అధిక వినియోగానికి ఒకరకంగా పరోక్షంగా యుద్ధం కారణంగా కనిపిస్తుంది.
మే నాటికి బాగా విద్యుత్ వినియోగం పెరుగుతుందని అంచనా
ఏపీలో ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య విద్యుత్ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుందని అధికారులు గుర్తించారు. ఈ సంవత్సరం మే నాటికి ఏపీలో విద్యుత్ వినియోగం 280 మిలియన్ల యూనిట్లకు చేరవచ్చని విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మార్చి సగం కూడా పూర్తికాకముందే ఇంత ఎక్కువగా విద్యుత్ వినియోగం చేయడం ఇదే మొదటిసారి.
యుద్ధంతో అన్ని రంగాలు ప్రభావితం
ఇదే విధంగా ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా మధ్య యుద్ధం కొనసాగితే ప్రత్యక్షంగాను, పరోక్షంగాను అన్ని రంగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్న ఆందోళన కనిపిస్తుంది. మానవ జీవనం భారంగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ముందు ముందు ఎలాంటి పరిస్థితులు వస్తాయో అన్న ఆందోళన వ్యక్తం అవుతుంది.
-
యుద్ధం వేళ అమెరికా సంచలన నిర్ణయం.. ఆర్మీ చీఫ్ తొలగింపు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
కేంద్రం వరాల సునామీ -
అడకత్తెరలో ట్రంప్- ప్రజల ముందుకు -
యుద్ధంపై ప్రధాని మోదీ కీలక మీటింగ్.. సంచలన నిర్ణయాలు ఇవే.. -
ఈ సాయంత్రం మోదీ అత్యవసర భేటీ- కఠిన నిర్ణయాల దిశగా కేంద్రం? -
5 కేజీల సిలిండర్లకూ దిక్కులేదు -
డొనాల్డ్ ట్రంప్ నాన్చివేత ధోరణి- 19 నిమిషాల ప్రసంగంలో ఇరాన్ భవిష్యత్ -
ఇజ్రాయెల్ భీకర ప్రతీకారం: హిజ్బుల్లా మాస్టర్‌మైండ్ హతం! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !!












Click it and Unblock the Notifications