ఆపరేషన్ 'రివర్స్': జగన్ పార్టీలోకి విశాఖపట్నం కీలక నేత, అందుకే చేరిక!

Posted By:
Subscribe to Oneindia Telugu

చిత్తూరు: ఇటీవలి వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్, ఇతర లెక్కలు వేసుకుంటూ కొందరు నేతలు ప్రతిపక్ష వైసీపీలో కూడా చేరుతున్నారు. సోమవారం విశాఖపట్నంకు చెందిన నాయకుడు వైసీపీలో చేరారు.

రెచ్చిపోతున్న మహేష్ కత్తి‌: వెనుక బలమైన శక్తి, పవన్ కళ్యాణ్‌పై ప్లాన్‌తో రంగంలోకి?

మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు తన అనుచరులతో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం జగన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా అయిన చిత్తూరులో ప్రజా సంకల్ప యాత్ర కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే.

 జగన్ సమక్షంలో వైసీపీలోకి

జగన్ సమక్షంలో వైసీపీలోకి

ఈ నేపథ్యంలో రవిబాబు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్‌ను కలిశారు. ఆయన సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ వారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడారు.

  YS Jagan padayatra : బీసీలకు అండగా ఉంటా, బాబు లా మోసం చెయ్యను !
   జగన్ ముఖ్యమంత్రి అయితేనే

  జగన్ ముఖ్యమంత్రి అయితేనే

  గిరిజనులు అందరూ వైయస్ జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని రవిబాబు అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే గిరిజనుల సమస్యలు పరిష్కారం అవుతాయని, వారి హక్కులు రక్షించబడతాయని వ్యాఖ్యానించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గిరిజనులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

   2014లో టిక్కెట్ మిస్

  2014లో టిక్కెట్ మిస్

  కుంభా రవిబాబు గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 ఎన్నికల సమయంలో ఆయన అనూహ్యంగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అరకు టిక్కెట్ తొలుత ఆయనకు ఇస్తారని ప్రచారం సాగింది. అయితే ఆ తర్వాత సోమకు టిక్కెట్ వచ్చింది.

   స్వతంత్ర అభ్యర్థిగా నాడు టీడీపీని దెబ్బకొట్టారు

  స్వతంత్ర అభ్యర్థిగా నాడు టీడీపీని దెబ్బకొట్టారు

  దీంతో కుంభా రవిబాబు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన కిడారి సర్వేశ్వర రావుకు 63వేలు, టీడీపీ అభ్యర్థికి శివేరి సోమకు 29వేలు, కుంభా రవిబాబుకు 25వేల పై చిలుకు ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఆయన తిరిగి వైసీపీలో చేరారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Former MLA Kumbha Ravi Babu joined YSR Congress Party on Monday in the presence of party chief YS Jaganmohan Reddy.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి