అసెంబ్లీ లాబీల్లో బొత్స, పత్తిపాటిల మధ్య ఆసక్తికర సంభాషణ

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి నాయకుడు బొత్స సత్యనారాయణ, వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావుల మధ్య మంగళవారం నాడు ఆసక్తికర సంభాషణ చోటుచేసుకొంది.

ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత అసెంబ్లీలో లాబీల్లో వైసిపి నాయకుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావులు ఒకరినొకరు ఆలింగనం చేసుకొన్నారు. కొద్దిసేపు పిచ్చాపాటి మాట్లాడుకొన్నారు.

funny conversation between bosta satyanarayana, pattipati pulla rao

అదే సమయంలో పులివెందులలో మంత్రి గంటా శ్రీనివాసరావును పోటీచేయించాలని టిడిపి ఆసక్తిగా ఉందనే విషయాన్ని మీడియా ప్రతినిధులు బొత్స వద్ద ప్రస్తావించారు.

funny conversation between bosta satyanarayana, pattipati pulla rao

అయితే గంటా శ్రీనివాసరావు ఎక్కువ కాలం రాజకీయాల్లో్ ఉండడం ఇష్టం లేనట్టుంది మంత్రి పత్తిపాటి పుల్లారావుకు అంటూ బొత్స చమత్కరించారు.పులివెందులలో గంటాను బరిలోకి దింపాలని సరదాగా సోమవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద పత్తిపాటి పుల్లారావు ప్రస్తావించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
funny conversation between former minister ysrcp leader bosta satyanaraya, agriculture minister pattipati pullarao in assembly lobby on tuesday.
Please Wait while comments are loading...