అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి, ఒక మహానగరం: 4భాగాలు, 7రీజినల్ కేంద్రాలు ఇలా.. (వీడియో)

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సీడ్ కేపిటల్‌ను సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సోమవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు.

అమరావతి రాజధాని నాలుగు భాగాలుగా, ఏడు రీజినల్ కేంద్రాలుగా ఉండనుంది. కాగా, ఇప్పటి వరకు పెద్దగా అలైన్మెంట్ మార్చలేదని, అవసరమైతే మార్చుతామని చంద్రబాబు చెప్పారు.

ఇదీ రాజధాని....

A glimpse of the Capital Area Master PlanThe Government of Singapore has presented the Seed Capital Area (SCA) Master Plan for Amaravati. The Seed Capital Area Master Plan is for an area of about 16.9 sq.km. Today is the unveiling of the dreams of 6 crores Telugus. The Seed Capital Area is planned for about 3 lakh residents. Being developed as a vibrant business hub, a total of about 7 lakh jobs are expected to be created in various sectors including government jobs.

Posted by Telugu Desam Party (TDP) on Monday, July 20, 2015

- నాలుగు విభాగాలుగా సీడ్ కేపిటల్ ప్లాన్.. అమరావతి గేట్ వే, డౌన్ టౌన్, అమరావతి గవర్నమెంట్ కోర్, అమరావతి వాటర్ ఫ్రంట్.
- లింగాయపాలెంలో ప్రభుత్వ కోర్ ఏరియాగా, ఉద్దండరాయునిపాలెంను అమరావతి డౌన్ టౌన్‌గా, తాళ్లాయపాలెంను అమరావతి గేట్ వే ఏరియాగా గుర్తింపు
- 16.9 కిలోమీటర్ల పరిధిలో సీడ్ క్యాపిటల్ నిర్మాణం
- మొత్తం 4,176 ఎకరాల విస్తీర్ణంలో సీడ్ క్యాపిటల్ ఏర్పాటు
- 40 లక్షల మంది నివాసానికి వీలుగా ప్రణాళిక
- కృష్ణా నది పరివాహక డిజైన్‌ను కూడా సింగపూర్ తయారు చేసింది.
- రాజధాని నగరంలో ఐటి, బిజినెస్ హబ్‌లను ఏర్పాటు చేసేలా ప్రణాళిక
- 45 అంతస్తులతో కూడిన రెండు టవర్స్‌‍లో ప్రభుత్వ కార్యాలయాలు
- కృష్ణా నదిలోని దీవులను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి
- 2050 వరకు చేపట్టాల్సిన అభివృద్ధిపై సింగపూర్ బృందం సూచనలు చేసింది
- ఒక మహా నగరం, 7 ప్రాంతీయ కేంద్రాలు, 7 డెవలప్‌మెంట్ కారిడార్లు
ప్రాంతీయ కేంద్రాలుగా... గుంటూరు, సత్తెనపల్లి, తెనాలి, గుడివాడ, గన్నవరం, నూజివీడు, నందిగామ

Hi tech Amaravati unveiled

- వెయ్యి కిలోమీటర్ల పరిధిలో రహదారులు
- 2035 నాటికి 11 మిలియన్ల జనాభా ఉండేలా ప్లాన్.
- 250 కిలోమీటర్ల పరిధిలో టూరిజం సర్కిల్ యూనిట్
- సీడ్ కేపిటల్‌లో 40 శాతం పార్కులు, వినోద కేంద్రాలు
- రాజధానిలో 135 కిలోమీటర్ల మెట్రో లైన్, వెయ్యి కిలోమీటర్ల రహదారి.
- జాతీయ, హైస్పీడ్ రైలు మార్గాలు
- 5 దశల్లో సీడ్ కేపిటల్ అభివృద్ధి
- 2035 నాటికి 35 లక్షల మందికి ఉపాధి కల్పనకు ప్రణాళిక
- 2050 నాటికి పూర్తిస్థాయి ప్రజా రాజధానిగా
- సీడ్ కేపిటల్లో 3 లక్షల గృహాలకు అనుగుణంగా ప్రణాళిక
- ఈ ప్రణాళికతో 7 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం
- ఆకర్షణీయ, పర్యావరణ రహిత, స్వయం సమృద్ధి నగరంగా అమరావతి అభివృద్ధి
- అమరావతి అభివృద్ధికి 9 ప్రధాన అంశాలతో ప్రణాళిక రూపొందించారు
- 2050 నాటికి అమరావతి పూర్తిస్థాయి ప్రజారాజధానిగా నిర్మాణం
- 2035 నాటికి 35 లక్షలు, 2050 నాటికి 56 లక్షల మందికి ఉద్యోగాల కల్పన
- రాజధాని కోసం భూములిచ్చిన రైతుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు
- భూములిచ్చిన రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించి 25 నుంచి 27 శాతం భూమిని తిరిగి రైతులకు
- 7,420 కిలో మీటర్ల పరిధిలో ఏపీ కేపిటల్ రీజియన్
- 217 చ.కి.మీ. పరిధిలో అమరావతి నిర్మాణం
- 2018లోపు అమరావతి తొలి దశ పనులు పూర్తి
- భూకంపాలు, తుఫానులు తట్టుకునే విధంగా భవనాల నిర్మాణం
- తక్కువ భూమిలో బహుళ అంతస్థుల భవనాలు
- ఏపి రాజధాని మధ్యలో బ్రహ్మ స్థానం. అక్కడ వెయ్యి పడకల ఉచిత ఆసుపత్రి. దాని చుట్టూ ఇన్ ల్యాండ్ వాటర్స్ ఏర్పాటు
- పడవల ద్వారా రాజధాని నగరంలోకి ఎక్కడికైనా వెళ్లేలా మాస్టర్ ప్లాన్
- సమీపంలో అసెంబ్లీ, సచివాలయం 250 కి.మీ. పొడవు గ్రీన్ వే
- నగరం మధ్యలో యూనివర్సిటీ, మెట్రో రైలు
- 3 గ్రామాలను కలుపుతూ కృష్ణా నదికి అభిముఖంగా వాటర్ ఫ్రంట్

English summary
The influence of Singapore is clearly evident in the first representational images of the seed capital of Amaravati, which were released by the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X