వారికి మంత్రి పదవిఇస్తే, ఏకేసిన కాగ్: జగన్ హెచ్చరిక, తిడుతుంటే బాబు ఆనందం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: పార్టీ మారిన వారిని స్పీకర్ ఎదుటే అధికార టిడిపి వైపు కూర్చోబెట్టారని, అలాంటి వారికి మంత్రి పదవులు ఇస్తే ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని వైసిపి అధినేత వైయస్ జగన్ అన్నారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు.

టిడిపి నేతలు తిడుతుంటే చంద్రబాబు ఆనందం

టిడిపి నేతలు తిడుతుంటే చంద్రబాబు ఆనందం

సభలో ప్రతిపక్ష నేత అయిన తనను దూషించేందుకే ఎక్కువ సమయం కేటాయించారన్నారు. టిడిపి ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు తిడుతుంటే చంద్రబాబు ఆనందించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాట్లాడుతుంటే పదేపదే మైక్ కట్ చేశారన్నారు. తనపై టిడిపి నేతలు వ్యక్తిగత ఆరోపణలు చేశారన్నారు. ఎప్పటిలా తనపై వ్యక్తిగత ఆరోపణలు చేశారని, అలాగే మైక్ కట్ చేశారని చెప్పారు.

సవాల్‌ను స్వీకరించని చంద్రబాబు

సవాల్‌ను స్వీకరించని చంద్రబాబు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాను విసిరిన ఏ సవాల్‌ను స్వీకరించలేదని జగన్ అన్నారు. అగ్రిగోల్డ్, పేపర్ లీకేజీ, అక్వా ఫుడ్ పార్క్.. ఇలా ఏ అంశంపై చర్చకు పట్టిబట్టినా సభను వాయిదా వేసి పారిపోయారని ఎద్దేవా చేశారు.
అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశామన్నారు. పేపర్ లీకేజీని సీబీఐతో విచారణ జరిపించాలని అడిగామన్నారు. కానీ ప్రభుత్వం అందుకు ముందుకు రాలేదని చెప్పారు. ఏ అంశంపై ప్రభుత్వం విచారణకు ముందుకు రాలేదన్నారు.

హోదాకు చంద్రబాబే వ్యతిరేకి

హోదాకు చంద్రబాబే వ్యతిరేకి

ప్రత్యేక హోదాకు చంద్రబాబే వ్యతిరేకి అని సభ సాక్షిగా తేలిపోయిందని జగన్ అన్నారు. హోదాపై తీర్మానం అడిగితే పట్టించుకోలేదని మండిపడ్డారు. తమకు ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యమని జగన్ చెప్పారు.

వారికి ప్రజలు బుద్ధి చెబుతారు

వారికి ప్రజలు బుద్ధి చెబుతారు

పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేలను టిడిపి వైపు కూర్చోబెట్టారన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలను దిగజార్చారన్నారు. స్పీకర్ ఎదుటే అధికార టిడిపి వైపు కూర్చోబెట్టారని, అలాంటి వారికి మంత్రి పదవులు ఇస్తే ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని జగన్ అన్నారు. కాగా, అఖిల ప్రియ వంటి వారు వైసిపి నుంచి గెలిచారు. ఆ తర్వాత టిడిపిలో చేరారు. వీరికి మంత్రి పదవి రానున్న విషయం తెలిసిందే.

ఏకిపారేసిన కాగ్ రిపోర్ట్

ఏకిపారేసిన కాగ్ రిపోర్ట్

రుణ మాఫీ విషయంలో ప్రభుత్వం తీరును కాగ్ రిపోర్ట్ తప్పుబట్టిందని జగన్ చెప్పారు. కాగ్ రిపోర్టులో ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపారన్నారు. సభ ఎంత అప్రజాస్వామికంగా జరిగిందో మీడియానే సాక్ష్యమని చెప్పారు. ప్రభుత్వం చర్చ విషయంలో తప్పించుకునే ధోరణి అవలంభించిందన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy on Friday questioned AP CM Chandrababu Naidu how he will take YSRCP MLAs, who joined in TDP, into cabinet.
Please Wait while comments are loading...