రెవెన్యూ, పోలీస్ శాఖల్లో బదిలీలు, ఒకేసారి అన్ని స్థాయిల్లో.. చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: రెండ్రోజుల్లో రెవెన్యూ, పోలీస్ శాఖలో బదిలీలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన పోలీస్ ఉన్నతాధికారులతో ఐపిఎస్ బదిలీలపై సమావేశం నిర్వహించారు.

ఐజీలు, ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలను ఒకేసారి బదిలీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఎంతోకాలంగా ఫెండింగ్‌లో ఉన్న ఆర్డీవోల బదిలీ ప్రక్రియకు సంబంధించి ప్రతిపాదనలు సోమవారం ఉదయానికి తనకు అందచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

IPS Transfers in AP: CM Chandrababu Consent

బదిలీ అయ్యే ఎస్పీలు, కొత్తగా వచ్చే ఎస్పీలు..రేంజ్‌ ఐజీలు, డీఐజీలతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడనున్నారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రంలోపు అందరితో మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమావేశంలో డిజిపి సాంబశివరావు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీశ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
CM Chandrababu Naidu conducted a meeting with AP Police Officials regarding the transfers of IPS officers in the state here on Sunday. CM ordered to finish IPS transfers within 2 days.
Please Wait while comments are loading...