బాబుకు షాక్ తప్పదా, ఇక జగన్ ఆపరేషన్: కెవిపి చక్రం తిప్పుతున్నారా?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు వైసిపి నేతలు, ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు. 21 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. ఇప్పటి దాకా టిడిపి లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి అసంతృప్త నేతలు తప్ప వైసిపిలో చేరలేదు.

కేశినేని నాని కంటే గేమ్ బాగా ఆడగలమని చంద్రబాబు ఆఫీస్ అధికారి

నాలుగు రోజుల క్రితమే మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి నంద్యాల ఉప ఎన్నికల్లో తనకు టిడిపి టిక్కెట్ ఇవ్వదని గుర్తించి, వైసిపిలో చేరారు. ఇప్పటి వరకు టిడిపి మాత్రమే అధికారంలో ఉన్నందున ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా పెద్ద ఎత్తున నేతలను చేర్చుకుంది.

జగన్ ఆపరేషన్

జగన్ ఆపరేషన్

మరో ఒకటిన్నర, రెండేళ్లలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ కూడా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపనున్నారనే ప్రచారం సాగుతోంది. టిడిపిలోని అసంతృప్త నేతలు, నియోజకవర్గాల పునర్విభజన లేకుంటే ఆ పార్టీని వీడే వారి లిస్ట్ తయారు చేసుకున్నారని తెలుస్తోంది.

వీరు అసంతృప్తికి గురైనా..

వీరు అసంతృప్తికి గురైనా..

ఆయా జిల్లాల్లో ఎవరెవరు తమ పార్టీలోకి వచ్చే అవకాశముందో, వారికి వైసిపి ముందు ముందు గాలం వేయనుందని అంటున్నారు. ఇటీవల జమ్మలమడుకు నేత రామసుబ్బారెడ్డి, నంద్యాలకు చెందిన ఏవీ సుబ్బారెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి అధిష్టానంపై అసంతృప్తికి గురయ్యారు.

కెవిపి చక్రం తిప్పుతున్నారా?

కెవిపి చక్రం తిప్పుతున్నారా?

ఇందులో శిల్పా వైసిపిలో చేరారు. మిగతా ఇద్దరిని అధినేత బుజ్జగించి, పార్టీ మారకుండా చేశారు. త్వరలో ఆపరేషన్ ఆకర్ష్‌ను వైసిపి పెంచనుందని అంటున్నారు. దీనికి చక్రం తిప్పుతోంది కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు అనే ప్రచారం సాగుతోంది.

నాడు వైయస్‌కు కూడా..

నాడు వైయస్‌కు కూడా..

కేవీపీ సాయం వల్లే పలువురు నేతలు వైసిపి వైపు చూస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జగన్‌కు ఆయన షాడోలో పని చేస్తూ వైసిపిలోకి తీసుకు వచ్చేందుకు పావులు కదుపుతున్నారని అంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి సిఎంగా ఉన్నప్పుడు కెవిపి ఆయన వెంటే ఉన్నారు. ఇప్పుడు జగన్‌కు కూడా సాయంచేస్తున్నారని అంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Rajya Sabha Member KVP Ramachandra Rao is helping YSR Congress Party chief YS Jaganmohan Reddy in operation akarsh.
Please Wait while comments are loading...