వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అచ్చెన్నాయుడు అరెస్ట్ పై జనసేన లేఖ .. ఆ అక్రమాలు దర్యాఫు చెయ్యండి కానీ ..

|
Google Oneindia TeluguNews

జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ పై తన స్పందన తెలియజేసింది. ఈఎస్ఐ స్కాం లో అవకతవకలతోపాటు ఇప్పటి వరకు జరిగిన అన్ని అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసిన జనసేన అచ్చెన్నాయుడు అరెస్ట్ పై ఆసక్తికర అంశాలు వెల్లడించింది .

 ఆ ఒక్క లేఖతో అచ్చెన్నాయుడు అవినీతి బయటపడిందా ? అచ్చెన్న అవినీతి చిట్టా ఏసీబీ దగ్గర ఉందా ? ఆ ఒక్క లేఖతో అచ్చెన్నాయుడు అవినీతి బయటపడిందా ? అచ్చెన్న అవినీతి చిట్టా ఏసీబీ దగ్గర ఉందా ?

ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పేర్కొన్న జనసేన నాదెండ్ల మనోహర్ పేరు మీద ఒక లేఖ విడుదల చేసింది. అచ్చెన్నాయుడు అరెస్ట్ అవినీతికి పాల్పడినందుకా ? లేక రాజకీయ కక్ష సాధింపు నా ? అని ఆ లేఖ ద్వారా ప్రశ్నించారు. ఏపీలో అధికారంలో ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. అవినీతి #mce_temp_url#ఏ రూపంలో ఉన్నా దానికి బాధ్యులు ఎంతటివారైనా జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఈ సందర్భంగా లేఖలో పేర్కొన్నారు .

Recommended Video

Janasena Leader Naga Babu Comments On Telugu Media
Janasenas response on atchannaidu arrest in ESI scam

అయితే అసెంబ్లీ సమావేశాలకు నాలుగైదు రోజుల ముందు అచ్చెన్నాయుడు ని అరెస్ట్ చేయడం సందేహాలకు తావిస్తోంది అని జనసేన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఒక శాసన సభ్యుని అరెస్ట్ చేసే ముందు రాజ్యాంగ నియమ నిబంధనలు పాటించాలని ప్రభుత్వానికి గుర్తు చేశారు. అయితే అచ్చెన్నాయుడు అరెస్ట్ లో అవి లోపించినట్లు గా కనిపిస్తున్నాయని, రాజ్యాంగ నిబంధనలను పాటించినట్టు గా కనిపించలేదని పేర్కొన్నారు. ఏది ఏమైనా ఈఎస్ఐ స్కాం లో అన్ని అక్రమాలపై దర్యాప్తు చేసి ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలి అవినీతికి పాల్పడిన వారి విషయంలో జనసేన ఎప్పుడు మద్దతు ప్రకటించదని జనసేన లేఖ ద్వారా స్పష్టం చేసింది.

English summary
The Janasena Party has expressed its reaction to the arrest of Telugu Desam Party legislator atchannaidu. Janaseena leader Nadendla manohar issued a letter in the name of janasena stating that the government should prove its integrity and transparency
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X