• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబుతో జీవితారాజశేఖర్ దంపతుల భేటీ

By Pratap
|

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తెలుగు సినీ దంపతులు జీవిత, రాజశేఖర్ కలిశారు. బిజెపిలో ఉన్న వారు శనివారం చంద్రబాబును కలిసి, సీమాంధ్రలో విజయం సాధించినందుకు అభినందించారు. వివిధ పార్టీల్లో చేరడానికి ప్రయత్నించి చివరకు వారు బిజెపిలో చేరిన విషయం తెలిసిందే.

ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు, కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును సిపిఐ నేత కె. నారాయణ, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి శనివారంనాడు కలిశారు.

Jeevitha, Rajasekhar couple meets Chandrababu

చంద్రబాబును శనివారంనాడు సచివాలయ, సీమాంధ్ర గెజిటెడ్ ఉద్యోగుల సంఘాల నాయకులు కూడా కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరును తెలుగునాడుగా మార్చాలని వారు కోరారు. అంతకు ముందు చంద్రాబు నాయుడు గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు.

కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ప్రతి రోజూ పలువురు ప్రముఖులు కలుస్తున్నారు. వారిని అభినందిస్తున్నారు.

English summary

 Telugu cine couple Jeevitha and Rajsekhar met Telugudesam party president Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X