మనమంటే తెలంగాణవాళ్లకు ద్వేషం: కెఇ సంచలనం

తెలంగాణవాళ్లకు మనపై ద్వేషం ఉందని ఆయన అన్నారు. ఆంధ్రవాళ్ల ఇళ్లు కూలగొడుతున్నరని, భూములు దున్నుతున్నారని ఆయన ఆరోపించారు. మాది భరతదేశం అనే స్ఫూర్తి మన పొరుగు రాష్ట్రంలోనే లేదని ఆయన అన్నారు. తెలంగాణవాళ్లు ఆంధ్రవాళ్లను దుర్మార్గంగా, అన్యాయంగా హింసిస్తున్నారని ఆయన అన్నారు. అందరి కృషి ఫలితంగానే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు.
చంద్రబాబు ప్రత్యేక నైపుణ్యం వల్ల హైదరాబాదుకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందని ఆయన చెప్పారు. బిల్ క్లింటన్, బిల్ గేట్స్ హైదరాబాద్ వచ్చి అభివృద్ధి చూసి ఆశ్చర్యపోయారని ఆయన అన్నారు. హైదరాబాదులో పనిచేస్తున్నవారిని ఎప్పుడెప్పుడు తరుముదామా అని చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ మంత్రులు కూడా ఇంగిత జ్ఝానం లేకుండా చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో బాగా పనిచేసిన చంద్రబాబు నాయకత్వాన్ని ఎలా పరచాలనే విషయంపై ఆలోచన చేయాలని ఆయన సూచించారు. చంద్రబాబు 24 గంటలు వెలుగు ఇస్తారని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సింది పునర్నిర్మాణం కాదని, నిర్మాణమని ఆయన అన్నారు. దానికి ఎలా తోడ్పడాలో ఆలోచన చేయాలని అన్నారు.
ఉద్యోగుల పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వయోపరిమితిని చంద్రబాబు 60 ఏళ్లకు పెంచారని ఆయన అన్నారు. తమ లాంటి వాళ్లు ఉంటారు పోతారని, ఉద్యోగులు 60 ఏళ్ల దాకా ఉంటారని, ఆంధ్ర శక్తి ఏమిటో ప్రపంచానికి చూపించాలని కెఇ అన్నారు.
తెలంగాణవాళ్లు ఆశ్చర్యపడేలా..
నా లాంటి వాళ్లు వస్తుంటారు, 20 నుంచి 60 ఏళ్ల వరకు ఉద్యోగాలు చేస్తుంటే ఎటు పోతారు.
60 ఏళ్లు మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేశారు. ఉద్యోగులు తమతో చేతులు కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మారుద్దామని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణవాళ్లు ఆశ్చర్యపోయేలా చేయాలని ఆయన అన్నారు. కాంగ్రెసు దశాబ్దం పాటు దుష్టపాలన చేసిందని, ఖాళీ ఖజానానూ విభజననూ ఇచ్చిపోయిందని, దీన్ని ఎదుర్కోవడానికి ఉద్యోగులు సహకరించాలని ఆయన అన్నారు.
హైదరాబాదునే వదులుకున్నాం..
తాము మంత్రులైంది జల్సాలు చేయడానికి కాదని, కష్టపడడానికే మంత్రులయ్యామని కెఇ చెప్పుకున్నారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా పనులు చేశామని, అందరికీ ఆమోదయోగ్యమైన పాలన చేశామని ఆయన అన్నారు. ఇప్పుడు ఏది చెప్పినా అడ్డుపుల్ల వేస్తున్నవారెవరో ఉద్యోగులకు తెలుసునని, పోలవరం కోసం ఏడు మండలాలను ఆంధ్రలో కలిపితే హదరాబాద్ బంద్ చేస్తారా అని అడిగారు. హైదరాబాదునే వదులుకున్నాం, ఏడు మండలాలు లెక్కా అని అన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు ఇందిరా సాగర్ అని పేరు పెట్టారని, దాన్ని తాము అంగీకరించబోమని అన్నారు. భద్రాద్రి రాముడు ఉన్న చోట తారకరాముడు ఉండాలని, ఆ పేరు పెట్టాలని ఆయన అన్నారు. ఇంకా చాలా ఉన్నాయని, ప్రభుత్వం ముందుకు పోతుందని, ఉద్యోగుల ముఖాల్లో సంతోషం కనిపించేవరకు పోరాటం చేస్తామని కెఇ కృష్ణమూర్తి అన్నారు.
-
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!!












Click it and Unblock the Notifications