ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి
రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంట్ చట్టాన్ని ఆమోదించిన అనంతరం పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. లోక్ సభ ఆమోదించిన సమయంలో మావిగన్ ప్రతిపాదనను తెరమీదికి తీసుకొచ్చారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మచిలీపట్నం- విజయవాడ- గుంటూరు (మావిగన్) ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలని సూచించారు.
అదే సమయంలో వైఎస్ఆర్సీపీకి చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి తెర మీదికి వచ్చారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా రాజకీయంగా మాత్రమే పరిష్కారమైన అంశమని విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు. అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి ఉద్దేశించిన ఏపీ పునర్విభజన చట్టం లోక్ సభలో ఆమోదం పొందినా న్యాయపరంగా ఎదురయ్యే సవాళ్లు చిక్కుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

అమరావతికి లోక్ సభలో చట్టబద్ధత కల్పించడంతో ఈ సమస్య ముగిసినట్టు కాదని సాయిరెడ్డి అన్నారు. లీగల్ గా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయనీ వివరించారు. చట్టంగా రూపుదాల్చినప్పటికీ భవిష్యత్ లో న్యాయపరమైన చిక్కులు ఎదరవుతాయని అభిప్రాయపడ్డారు. వీటిని నివారించడానికి చంద్రబాబు తాను సూచించిన అంశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం ఆరు అంశాలతో కూడిన ట్వీట్ ను కొద్దిసేపటి కిందటే పోస్ట్ చేశారు సాయిరెడ్డి.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ద్వారా అమరావతిని ఏపీ రాజధానిగా నిర్ణయించడం తీవ్ర చట్టపరమైన సమస్యలు కలిగి ఉందని, ఇందులో ప్రధానమైనది- రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్రానికే ఉంటుందని 2020లో ఏపీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే స్పష్టం చేసిందని సాయిరెడ్డి గుర్తు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 3, 4 పునర్వ్యవస్థీకరణకు మాత్రమే అనుమతిస్తాయే గానీ శాశ్వత రాజధానిని నిర్ణయించడానికి కాదని ఆయన పేర్కొన్నారు.
తన రాజధానిని తానే నిర్ణయించుకునే హక్కు, అధికారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన విధి అని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అది ఇన్సిడెంటల్ మ్యాటర్ కానే కాదని అన్నారు. చట్టం చేయడం ద్వారా రాజధానిని నిర్ణయించడం అనేది ఫెడరల్ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించినట్టేనని, దీనివల్ల రాష్ట్రాన్ని, అక్కడి పరిపాలనను కేంద్రం ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకున్నట్టవుతుందని, కేంద్రం నియంత్రిత యూనిట్‌గా మారుస్తుందని అభిప్రాయపడ్డారు.
Amaravati as State Capital may be a politically settled issue. However I advise @ncbn to look into the following legal issues to avoid possible future legal implications.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 4, 2026
Designating #Amaravati as AP’s capital through the Andhra Pradesh Reorganisation Act, 2014 is deeply…
అమరావతిని ఎంపిక చేయడానికి ఎటువంటి సంప్రదింపులు గానీ, ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ గానీ జరగలేదని ఆయన గుర్తు చేశారు. ఇది ఏకపక్ష నిర్ణయంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఏ పునర్వ్యవస్థీకరణ చట్టం కూడా గతంలో రాజధానులను నిర్ణయించలేదని, ఆ అధికారాన్ని ఆయా రాష్ట్రాలకే వదిలివేశాయని అన్నారు.
కేంద్రం అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించడాన్ని సవాల్ చేస్తూ ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే రద్దయ్యే ప్రమాదం కూడా లేకపోలేదని అంచనావేశారు. దీనివల్ల పాలనలో సంస్థాగత అస్థిరత ఏర్పడుతుందని అన్నారు. ఒక రాజధాని ఆర్థిక, పరిపాలనా సాధ్యాసాధ్యాలు, ప్రజా పెట్టుబడుల నుండి ఉద్భవించాలి తప్ప, చట్టబద్ధమైన నిర్బంధం ద్వారా కాదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.
-
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !! -
Amaravati: అమరావతికి కేంద్రం మరో గిఫ్ట్-బిల్లు ఆమోదించిన 24 గంటల్లో..! -
Mavigun Vs Amaravati: అమరావతి కంటే మావిగాన్ ఎలా బెటర్ ? అంబటి వివరణ..! -
జగన్ కు 'మావిగన్' సలహా ఆయనదే, అసలు టార్గెట్..!! -
సాయిరెడ్డి తాజా సంకేతాలు, తెర వెనుక..!? -
శూన్యం నుంచి సృష్టి వరకు.. చరిత్ర నిన్ను క్షమించదు జగన్ -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం..












Click it and Unblock the Notifications