కాకినాడలో మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా సందడి...అందం...ఆశ్చర్యం...

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

కాకినాడ: ఆంధ్రాలో ఆస్ట్రేలియా అందాల ముద్దుగుమ్మ హల్ చల్ చేసింది. ఒక తెలుగు సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనేందుకు కాకినాడకు విచ్చేసిన ఈ కంగారూ బ్యూటీ సందడి సందడి చేసింది.

మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా 2017 ఎస్మా ఒలోడార్ శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో సందడి చేశారు. తెలుగు ట్రెడిషనల్‌ కల్చరల్‌ సోషల్ ఈవెంట్ సంస్థ నిర్వహిస్తున్నకార్యక్రమంలో పాల్గొనేందుకు గాను ఆమె కాకినాడ వచ్చారు. అనూహ్యంగా ఆంధ్రాకు విచ్చేసిన ఈ ఆస్ట్రేలియా అమ్మడికి ఘనస్వాగతం లభించింది.

 పాఠశాల సందర్శన...

పాఠశాల సందర్శన...

తెలుగు ప్రిన్సెస్‌ ట్రెడిషనల్‌ కల్చరల్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాకినాడ విచ్చేసిన మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా ఎస్మా ఒలోడార్ స్థానిక సాంబమూర్తినగర్‌లోని ప్రభుత్వ బధిరుల ఉన్నత పాఠశాలను సందర్శించింది. అక్కడి బాలబాలికలతో కలిసి సరదా సరదాగా గడిపింది.

 వారి భాషలో...

వారి భాషలో...

ఈ సందర్భంగా ఎస్మా ఒలోడార్ బధిర విద్యార్థులతో వారికి అర్థమయ్యే తీరులో కేవలం సైగలతోనే సంభాషించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఎస్మా ఒలోడార్ ప్రతిభ గురించి విశేషంగా చెప్పుకున్నారు.

 ఆటలు...పాఠాలు...

ఆటలు...పాఠాలు...

ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా ఎస్మా ఒలోడార్ తోపాటు ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌, గ్లోబర్‌ ఎడ్వైజర్‌ సతీష్‌ టిక్కర్‌ కూడా పాల్గొన్నారు.
వీరిద్దరూ బధిర చిన్నారులకు ఆటలాడటంతో పాటు పాఠాలను కూడా చెప్పడం విశేషం.ఈ సందర్భంగా చిన్నారులకు అల్పాహారం, బిస్కెట్లు అందజేశారు.

  Miss World 2017 Manushi Chhillar : మిస్ వరల్డ్ పై 'చిల్లర' వ్యాఖ్యలు | Oneindia Telugu
   సామాజిక సేవా స్పృహ కోసం...

  సామాజిక సేవా స్పృహ కోసం...

  ఈ సంధర్బంగా ఈవెంట్‌ మేనేజర్‌ శిరీష మాట్లాడుతూ యువతలో అందంతో పాటు సామాజిక సేవా స్పృహను పెంపొందించే లక్ష్యంగా కాకినాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగానే బధిరుల పాఠశాలను సందర్శించామన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The Miss World Australia Esma Olodar was came to Kakinada in the East Godavari district on Friday. She came to Kakinada to participate in the Telugu Princess Traditional Cultural Programme. On this occasion she visited the Government Deaf High School in Sambamurthy Nagar. On this occasion they were budding together.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి