వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవిపై నారాయణ సంచలన వ్యాఖ్యలు: లోకేష్‌పై పవన్ ఆరోపణల మీద బిజెపి నేత

By Pratap
|
Google Oneindia TeluguNews

అమరావతి: కాంగ్రెసు నేత, మెగాస్టార్ చిరంజీవి మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాపులను తాకట్టు పెట్టారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు.

చిరంజీవి వల్ల కాపులు 20 ఏళ్లు వెనక్కి వెళ్లారని ఆయన అన్నారు. వైసిపి, బిజెపిలతో పవన్ కల్యాణ్ జత కట్టారని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ ప్రసంగం టిడిపిని లక్ష్యంగా చేసుకుని సాగిందని అన్నారు.

 పవన్ కల్యాణ్‌ది సినిమా డైలాగే

పవన్ కల్యాణ్‌ది సినిమా డైలాగే

ఎమ్మెల్యేలంతా అవినీతిపరులని అనడం సినిమా డైలాగేనని ఆయన పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై అన్నారు. లోకేష్ యువకుడు, నిజాయితీగా పనిచేస్తున్నారని అన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత దాన్ని కాంగ్రెసులో విలీనం చేసిన విషయం తెలిసిందే.

 పవన్ కల్యాణ్ ఆరోపణలను నమ్మడం లేదు

పవన్ కల్యాణ్ ఆరోపణలను నమ్మడం లేదు

ఐటి మంత్రి నారా లోకేష్‌పై పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలను తాను నమ్మడం లేదని బిజెపి నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మంచిది కాదని అన్నారు. ఎవరో అనుకుంటున్నారని లోకేష్‌పై ఆరోపణలు చేయడమేమిటని ప్రశ్నించారు.

 చంద్రబాబుకు చెప్పినా కూడా రౌడీయిజం ఆగలేదు

చంద్రబాబుకు చెప్పినా కూడా రౌడీయిజం ఆగలేదు

ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టాలంటేతాను గెలిచే గెలిచే అవకాశమే లేదని విష్ణు కుమార్ రాజు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.బిజెపికి కుట్రలు తెలియవని అన్నారు. ఇసుక కుంభకోణంపై తాను చంద్రబాబుకు ముందే చెప్పినట్లు ఆయన తెలిపారు. తాను చంద్రబాబుకు చెప్పినప్పటికీ ఇసుక రీచ్‌ల్లో రౌడీయిజం ఆగలేదని ఆయన అన్నారు.

 ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిజమే...

ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిజమే...

విశాఖలో భూకబ్జాలు ఆగకపోతే ఆరాచకాలు పెరుగుతాయని విష్ణుకుమార్ రాజు అన్నారు. తాను చెప్పిన తర్వాతనే భూకబ్జాలపై సిట్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరిగిందనేదని నిజమేనని అన్నారు. రాజకీయ ప్రోత్సాహంతోనే అవినీతి జరుగుతోందని అభిప్రాయపడ్డారు.

English summary
Andhra Pradesh minister Narayana made conroversial comments on Congress MP Mega star Chiranjeevi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X