ఏపీలో నైట్ కర్ఫ్యూ: రాత్రి 10 తర్వాత వేటికి అనుమతి, వేటికి అనుమతి లేదంటే..?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నేటి(శనివారం) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. తాజాగా, రాత్రి కర్ఫ్యూకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో నైట్ కర్ఫ్యూలో వీటికి అనుమతి..
ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్లు, ఫార్మసీలు, అత్యవసర సేవలందించే కార్యకలాపాలు మాత్రమే కర్ఫ్యూ సమయంలో పనిచేసేందుకు అనుమతి ఉంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్లు, ఇంటర్నెట్, కేబుల్ సేవలు, పెట్రోల్ పంపులు, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థల కార్యాలయాలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది. నీటి సరఫరా, పారిశుద్ధ్య సేవలు, ప్రైవేటు సెక్యూరిటీ సేవలు, ఆహార సరఫరా సేవలకూ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది. వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది, అత్యవసర సేవలు, నర్సింగ్ సిబ్బంది, గర్భిణులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల నుంచి వచ్చే వ్యక్తుల రాకపోకలకు అనుమతి ఉంది. అత్యవసర సరుకు రవాణా వాహనాలు, అంతర్రాష్ట్ర సరుకు రవాణాకు ఎలాంటి ఆంక్షలు లేవు.

రాత్రిపూట కర్ఫ్యూలో వీటికి అనుమతి లేదు..
కర్ఫ్యూలో భాగంగా అన్ని కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేయాలి. నిర్దేశించిన రంగాలకు చెందిన వ్యక్తులు మినహా మిగితా వారందరి రాకపోకలపై ఆంక్షలున్నాయి. ప్రజా రవాణాతోపాటు ఆటోలు, ఇతర వాహనాలకు నిర్ణీత కర్ఫ్యూ వేళల వరకు మాత్రమే అనుమతి ఉంది. ఇక కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే డిజాస్టర్ మేనేజ్ మెంట్ కింద కిఠనంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.

తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది..
కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించడం జరుగుతోంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ తోపాటు కరోనా నిబంధనల అమలుకు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే మాస్కులు ధరించని వారికి రూ. 100 జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో 10వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!!









Click it and Unblock the Notifications