PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..!

ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) మొదలుపెట్టిన దాడులు, వాటికి ప్రతీకారంగా ఆ దేశం చేస్తున్న ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతున్న వేళ భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ఇవాళ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత్ కు ఆందోళనకరమేనని ఆయన తేల్చేశారు. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రపంచ దేశాలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

కోవిడ్ ఎదుర్కొన్న తరహాలో పశ్చిమాసియా సంక్షోభాన్ని కూడా భారత్ అధిగమిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. పశ్చిమాసియా పరిస్థితిని పరిష్కరించేందుకు చర్చలు జరపాలని భారత్ సూచించిందన్నారు. మానవత్వంలో ఏ ప్రాణనష్టాన్ని సమర్థించలేమన్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 3.75 లక్షల మందికి పైగా భారత్‌కు తిరిగి వచ్చారని గుర్తుచేశారు. ఒక్క ఇరాన్ నుంచే 1000 మంది తిరిగి వచ్చారని, వీరిలో ఎక్కువ మంది వైద్య విద్యార్థులే అన్నారు. భారతీయుల భద్రతకు అన్ని దేశాలు హామీ ఇచ్చాయని, అయినప్పటికీ, కొందరు ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు.

PM Modi Urges United Global Voice for Peace Amid Worrying West Asia Crisis

గత దశాబ్ద కాలంలో ఇలాంటి సంక్షోభాల కోసం భారతదేశం తన ముడి చమురు,పెట్రోల్ , డీజిల్ నిల్వలను విస్తరించుకుందని ప్రధాని మోదీ తెలిపారు. నిరంతరాయ సరఫరాను సులభతరం చేయడానికి భారత్ వద్ద పుష్కలమైన ముడి చమురు నిల్వలు ఉన్నాయని ప్రధాని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక నౌకలు హార్ముజ్ జలసంధి (strait of hormuz)లో చిక్కుకుపోయాయని, వాటిలో పెద్ద సంఖ్యలో భారతీయ సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఇది భారతదేశానికి కూడా ఒక ప్రధాన ఆందోళన అన్నారు.

PM Modi Urges United Global Voice for Peace Amid Worrying West Asia Crisis

ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో రాజ్యసభ (rajya sabha) నుంచి శాంతి సంప్రదింపుల కోసం ఒక ఐక్య స్వరం యావత్ ప్రపంచానికి వినిపించడం అవసరమన్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, తాను పశ్చిమ ఆసియాలోని చాలా దేశాల అధినేతలతో రెండు విడతలుగా ఫోన్ సంభాషణలు జరిపినట్లు చెప్పారు. తాము అన్ని గల్ఫ్ దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, అలాగే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాతో కూడా టచ్‌లో ఉన్నామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+