వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమీపిస్తున్న గడువు: పనుల్లో వేగం, నాలుగు రోజుల్లో సిద్ధం (ఫోటోలు)

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: జూన్ 27... హైదరాబాద్ నుంచి సచివాలయ ఉద్యోగులను తరలించేందుకు ప్రభుత్వం విధించిన గడువు. ఈ గడువు తేదీ దగ్గర పడుతుండటంతో వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ పనుల్లో నిర్మాణ వేగాన్ని సంస్ధలు పెంచాయి. సీఎం కార్యాలయంతో సహా హెచ్‌ఓడీలు, ఇతర ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న ఐదు భవనాల్లో సివిల్‌వర్క్సు 80 శాతం పూర్తైంది.

ఒకటి, రెండు బ్లాకుల్లో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో అంతర్గత పనులు జరుగుతున్నాయి. పై అంతస్తుల్లో సెంట్రింగ్‌ తీసి, గదుల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ రెండు బ్లాకులను షాపూర్జీ అండ్‌ పల్లోంజీ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఎల్ అండీ టీ సంస్ధ చేపట్టిన మూడు, నాలుగు, ఐదు బ్లాకుల్లో గదుల నిర్మాణం 75 శాతం పూర్తైంది.

ప్లాస్టింగ్‌లు, వైట్‌వాష్‌, మార్బుల్స్‌తో ఫ్లోరింగ్‌, మెట్ల ల్యాండింగ్‌ పనులు జరుగుతున్నాయి. ఐదో బ్లాక్‌లో పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఐదో బ్లాక్‌లో అన్ని పనులు శరవేగంగా సాగుతున్నాయి. కరెంటు వైరింగ్‌, ఫైర్‌ పైపింగ్‌, ఏసీ లైను, గదులకు వైట్‌వాష్‌, టైల్స్‌తో ఫ్లోరింగ్‌, మెట్ల ల్యాండింగ్‌, విండోస్‌కు అద్దాలు, పోర్టుకోలు, విభాగాల వారీగా ఉద్యోగుల చాంబర్ల నిర్మాణం వంటి అంతర్గత వర్కు 80శాతం పూర్తయింది.

మిగిలిన పనులు నాలుగు రోజుల్లో పూర్తిచేస్తామని నిర్మాణ సంస్థ ఇంజనీర్లు తెలిపారు. అలాగే రెండో బ్లాక్‌లోనూ 70శాతం పైగా పనులు పూర్తయ్యాయి. నాలుగు రోజుల్లో రెండు బ్లాకులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ముందుగా పూర్తయ్యే ఈ రెండు, ఐదు బ్లాకులను సచివాలయ ఉద్యోగులకు కేటాయిస్తారని అధికార వర్గాల ద్వారా తెలిసింది.

విజయవాడ, మంగళగిరి, గుంటూరు నుంచి తాత్కాలిక సచివాలయానికి చేరుకునే రోడ్లను ఇప్పటికే విస్తరించారు. సచివాలయ ప్రాంగణంలో అంతర్గతరోడ్ల నిర్మాణం యుద్ధప్రాతిపదికన జరుగుతోంది. సచివాలయానికి నిరంతర విద్యుత సరఫరా చేసేందుకు తాడికొండ, తాడేపల్లి సబ్‌స్టేషన్ల నుంచి ప్రత్యేక లైను వేశారు.

ఈ విద్యుత్ పనులు రెండు రోజుల్లో పూర్తి కానున్నాయి. వెంటనే ట్రయల్‌ వేయనున్నారు. అలాగే సచివాలయానికి తుళ్లూరు ఎత్తిపోతల పథకం నుంచి వైపు లైను ద్వారా తాగు, వాడకపు నీరు అందించే పైపు లైను నిర్మాణం పూర్తయింది. మరోవైపు తాత్కాలిక సచివాలయ మార్గంలో మందడం సినిమా హాలు సమీపంలో అన్న క్యాంటిన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

 సమీపిస్తున్న గడువు: పనుల్లో వేగం, నాలుగు రోజుల్లో సచివాలయం సిద్ధం

సమీపిస్తున్న గడువు: పనుల్లో వేగం, నాలుగు రోజుల్లో సచివాలయం సిద్ధం


ఇది ఇలా ఉంటే నవ్యాంధ్ర రాజధాని ప్రాంతానికి హెచ్ వోడీలు పూర్తిస్థాయిలో తరలివెళ్లేందుకు మరో 2 నెలల సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు మహిళా ఉద్యోగులకు వసతి గృహాలు, అధికారులకు నివాసయోగ్యమైన భవనాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించేందుకు సీఎస్‌ నేతృత్వంలోని బృందం గురువారం రాజధాని ప్రాంతంలో పర్యటించనుంది.

 సమీపిస్తున్న గడువు: పనుల్లో వేగం, నాలుగు రోజుల్లో సచివాలయం సిద్ధం

సమీపిస్తున్న గడువు: పనుల్లో వేగం, నాలుగు రోజుల్లో సచివాలయం సిద్ధం


ఈ బృందంలో సీఎస్‌పాటు, తరలింపు వ్యవహారాల సంధాన కర్త, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ప్రేమచంద్రారెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత ఉన్నారు. కుటుంబాన్ని హైదరాబాద్‌లో వదిలి రాజధాని ప్రాంతానికి తరలుతున్న మహిళా ఉద్యోగులకు భద్రతతో కూడిన వసతి కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకున్న విషయం తెలిసిందే.

సమీపిస్తున్న గడువు: పనుల్లో వేగం, నాలుగు రోజుల్లో సచివాలయం సిద్ధం

సమీపిస్తున్న గడువు: పనుల్లో వేగం, నాలుగు రోజుల్లో సచివాలయం సిద్ధం

ఈ మేరకు మహిళా ఉద్యోగులకు వసతి కల్పించేందుకు ఏయే ప్రాంతాలు అనువుగా ఉన్నాయి? అనువుగా ఉన్న ప్రాంతాల్లో భవనాలు అందుబాటులో ఉన్నాయా? లేదా? వంటి విషయాలు తెలుసుకొనేందుకు స్వయంగా సీఎస్‌ రంగంలోకి దిగారు. అలాగే, రెయిన ట్రీలో నివాసం ఉండేందుకు చాలా మంది అధికారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు.
సమీపిస్తున్న గడువు: పనుల్లో వేగం, నాలుగు రోజుల్లో సచివాలయం సిద్ధం

సమీపిస్తున్న గడువు: పనుల్లో వేగం, నాలుగు రోజుల్లో సచివాలయం సిద్ధం


తాత్కాలిక సచివాలయం వెలగపూడికి అది చాలా దూరంలో ఉండటం, అక్కడి భవనాలు నివాసయోగ్యంలేకపోవడం వంటి అంశాలను కొందరు అధికారులు సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అధికారుల కోసం కూడా నివాసయోగ్యమైన ప్రాంతాలు, భవనాలను సీఎస్‌ బృందం పరిశీలించనుంది.

 సమీపిస్తున్న గడువు: పనుల్లో వేగం, నాలుగు రోజుల్లో సచివాలయం సిద్ధం

సమీపిస్తున్న గడువు: పనుల్లో వేగం, నాలుగు రోజుల్లో సచివాలయం సిద్ధం


ఇదిలా ఉండగా, కుటుంబంతోసహా రాజధాని ప్రాంతానికి తరలుతున్న ఉద్యోగుల పిల్లలకు స్కూల్‌ అడ్మిషన్లు ఇప్పించే బాధ్యతను ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖకు అప్పగించింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖకు 78 దరఖాస్తులు అందగా, 54 దరఖాస్తులకు అడ్మిషన్లు ఇప్పించారు.

 సమీపిస్తున్న గడువు: పనుల్లో వేగం, నాలుగు రోజుల్లో సచివాలయం సిద్ధం

సమీపిస్తున్న గడువు: పనుల్లో వేగం, నాలుగు రోజుల్లో సచివాలయం సిద్ధం

మరో 24 దరఖాస్తులపై చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిరోజూ ఉద్యోగుల నుంచి తమకు స్కూల్‌ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు అందుతున్నాయని పాఠశాల విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. హెచ్‌ఓడీల తరలింపు విషయానికి వస్తే.. వైద్యఆరోగ్య శాఖ తప్ప మిగిలిన అన్ని హెచ్‌ఓడీలు విజయవాడ/గుంటూరు ప్రాంతాల్లో భవనాలు చూసుకున్నారు.

English summary
New Secretariat construction work at Velagapudi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X