కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చంద్రబాబు: జగన్‌కు పవన్ కల్యాణ్ కౌంటర్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనసేన చీప్ పవన్ కల్యాణ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. జససేనను టిడిపికి అంటగడుతూ జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు.

ఒక మాట అనడం సులభమని, రాజకీయ నాయకులు ఆలోచించి మాట్లాడాలని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా కాజా టోల్‌గేట్ సమీపంలో నూతన నివాసానికి సోవరం పవన్ కల్యాణ్ తన సతీమణితో కలిసి భూమి పూజ చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

వైఎస్ జగన్ ఏమన్నారు...

వైఎస్ జగన్ ఏమన్నారు...

జనసేన తెలుగుదేశం పార్టీలో అంతర్భాగమని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. జనసేనకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చంద్రబాబేనని వ్యాఖ్యానించారు. ఆ విమర్శలను పవన్ కల్యాణ్ తిప్పికొట్టారు. జనసేనకు చంద్రబాబు అయితే వైసిపికి నరేంద్ర మోడీ అనుకోవాలా అని ఆయన ప్రశ్నించారు.

ఏర్పాట్లపై పవన్ సూచన

ఏర్పాట్లపై పవన్ సూచన

జనసేన ఆవిర్భావ ఏర్పాట్లను పనవ్ కల్యాణ్ పరిశీలించారు. ఏర్పాట్లపై నాయకులను అడిగి తెలుసుకున్నారు.వారికి సూచనలు, సలహాలు ఇచ్చారు. సభకు తరలి వచ్చే కార్యకర్తలకూ ప్రజలకూ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ఓ వైపు జగన్, మరో వైపు పవన్ కల్యాణ్

ఓ వైపు జగన్, మరో వైపు పవన్ కల్యాణ్

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర సోమవారం గుంటూరు జిల్లాలో ప్రారంభమైంది. ప్రకాశం జిల్లా చీరాల నుంచి బాపట్లలోకి ప్రవేశించారు. జిల్లాలోని 12 శాసనసభ నియోజకవర్గాల్లో మూడు వారాల పాటు ఆయన పాదయాత్ర సాగుతుంది. కాగా, ఈ నెల 14వ తేదీన పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ సభ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో జరుగుతుంది.

 సభకు భారీ బందోబస్తు..

సభకు భారీ బందోబస్తు..

జనసేన ఆవిర్బావ దినోత్సవ సభకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారంనాు గుంటూరు అర్భన్ ఎస్పీ విజయరావు ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. సభా ప్రాంగణం రూట్ మ్యాప్‌ను పరిశీలించి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.వేదికపై పరిమితికి మించి వ్యక్తులు ఉండకుండా చూడాలని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Jana Sena chief Pawan Kalyan has retaliated the YSR Congress president YS Jagan comments on his party affiliation.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి