సెంటిమెంట్ పునరావృతమౌతోందా, చరిత్ర తిరగరాస్తారా, నంద్యాల తీర్పు ఎలా ఉంటుంది?

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల:నంద్యాల ఉప ఎన్నికల్లో ఇప్పటివరకు కొనసాగిన సెంటిమెంట్ పునరావృతమౌతోందా, లేదా చరిత్ర తిరగరాస్తోందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ప్రస్తుతం జరుగుతున్న ఉపఎన్నిక అధికార టిడిపి, విపక్ష వైసీపీలు నువ్వా, నేనా అనే రీతిలో ప్రచారం చేస్తున్నాయి.

నంద్యాల: ఓట్ల చీలిక , రాయలసీమ సెంటిమెంట్, వైసీపీకి దెబ్బెనా?

నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఈ నెల 23వ, తేదిన పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను టిడిపి, వైసీపీలు తీవ్రంగా ప్రయత్నాలను సాగిస్తున్నాయి.

శిల్పా ఎఫెక్ట్: దిద్దుబాటులో టిడిపి, 'ఉప ఎన్నిక వాయిదాకు కుట్ర'

ఈ ఉఫ ఎన్నికల్లో విజయం సాధించే పార్టీయే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తోందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. దీంతో ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నాలను సాగిస్తున్నాయి.

'మా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు, పవన్‌కళ్యాణ్ మద్దతు మాకే'

రెండు పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. రెండు పార్టీలకు చెందిన కీలక నేతలు నంద్యాలలోనే మకాం వేశారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను ఇరు పార్టీల నేతలు వ్యూహరచనలు చేస్తున్నారు.

సెంటిమెంట్ పునరావృతమౌతోందా?

సెంటిమెంట్ పునరావృతమౌతోందా?

నంద్యాలలో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తోందనే సెంటిమెంట్ ఈ ప్రాంతంలో బలంగా ఉంది. అయితే 2014లో మాత్రం అలా జరగలేదు. గత ఎన్నికల్లో వైసీపీకి చెందిన భూమా నాగిరెడ్డి విజయం సాధించారు. కానీ, రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఉపఎన్నికల్లో సెంటిమెంట్ పునరావృతం కానుందా, లేదా చరిత్రను తిరగరాస్తారా నంద్యాల ఓటర్లు అనే ఉత్కంఠ నెలకొంది. పార్టీలు, నేతలు సెంటిమెంట్లను నమ్ముతుంటారు.

1983 నుండి సెంటిమెంట్ ప్రకారంగానే

1983 నుండి సెంటిమెంట్ ప్రకారంగానే

1983లో నంద్యాల నుండి టిడిపి అభ్యర్థులే విజయం సాధించారు. 1985లో కూడ ఆయనే పోటీచేసి విజయం సాధించారు.ఈ రెండు దఫాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వమే ఏర్పాటైంది. 1989లో ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. ఫరూక్ ఓటమిపాలయ్యారు. 1994, 1999లో టిడిపి అభ్యర్థిగా పోటీచేసిన ఫరూక్ విజయం సాధించారు. ఆ రెండు దఫాలు కూడ రాష్ట్రంలో టిడిపి అధికారంలో ఉంది. 2004, 2009లో శిల్పా మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి విజయం సాధిస్తే, రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది.

రాష్ట్ర విభజన తర్వాత సెంటిమెంట్ మారిందా

రాష్ట్ర విభజన తర్వాత సెంటిమెంట్ మారిందా

రాష్ట్ర విభజన తర్వాత సెంటిమెంట్ మార్పులు చేర్పులు చోటుచేసుకొన్నాయనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించిన భూమా నాగిరెడ్డి ఆ తర్వాత చోటుచేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టిడిపిలో చేరారు. దీంతో ఆయన అధికార పక్షమే అయ్యారనే అభిప్రాయాలు కూడ వ్యక్తం చేసేవారు కూడ లేకపోలేదు.అయితే ఈ నెల 23న, జరిగే ఉప ఎన్నికల్లో ఓటర్లు ఏ రకమైన తీర్పును ఇస్తారోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

నంద్యాల ఓటర్ల తీర్పు ఎలా ఉంటుంది

నంద్యాల ఓటర్ల తీర్పు ఎలా ఉంటుంది

నంద్యాల స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనేది ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఈ దఫా జరిగే ఎన్నికల్లో ఓటర్లు సెంటిమెంట్‌ను కొనసాగిస్తారా, లేదా చరిత్రను తిరగరాస్తారా అనేది హట్‌టాపిక్‌గా మారింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రెండు పార్టీలు తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. 2019 ఎన్నికలకు నంద్యాల ఉప ఎన్నికను సెమీఫైనల్‌గా భావిస్తున్నాయి పార్టీలు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
There is a sentiment in Nandyal assembly segment.Who win this assembly segment, that party will form government in Ap state. what will happening this time.
Please Wait while comments are loading...