వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్నేక్ గ్యాంగ్, గుర్రాలపై వచ్చి..: సెర్చ్ ఇలా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్నేక్ గ్యాంగ్‌కు సంబంధించి మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ బుధవారం తెలిపారు. మంగళవారం అర్థరాత్రి నుండి 400 మంది పోలీసులతో పహాడీషరీఫ్ ప్రాంతంలో ఇల్లిల్లు జల్లెడ పట్టి రౌడీషీటర్లు, అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

స్నేక్ గ్యాంగ్‌కు సంబంధించి ఇంకా 13 మందిని గుర్తించగా.. వీరిలో అర్ధరాత్రి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. పోలీసుల తనిఖీల్లో 30 ద్విచక్రవాహనాలు, రెండు కార్లు, మూడు వ్యాన్లతో పాటు రెండు గుర్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.

స్నేక్ గ్యాంగ్ రోడ్డు పైన వెళ్లే మహిళలను ఈవ్ టీజింగ్ చేయడం, బెదిరించి గొలుసులు లాక్కెళ్లడం వంటి దౌర్జన్యాలకు పాల్పడే వారని తెలిపారు. నిందితులు తమ దౌర్జన్యాల పరంపంర కొనసాగించడానికి గుర్రాలను వినియోగించే వారని కమిషనర్ తెలిపారు.

స్నేక్ గ్యాంగ్

స్నేక్ గ్యాంగ్

రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని పహాడీషరీఫ్‌ పరిధిలో మంగళవారం అర్థరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దాదాపు 400 మంది పోలీసులతో విస్తృత తనిఖీలు చేపట్టారు. సైబరాబాద్‌ సీపీ ఆనంద్‌ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. స్నేక్‌ గ్యాంగ్‌ ప్రధాన నిందితుడు ఫైసల్‌ దయానీ ఇంట్లో రెండు గుర్రాలు, కారు, రెండు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 స్నేక్ గ్యాంగ్

స్నేక్ గ్యాంగ్

ఫైసల్‌ దయానీ సోదరులు అమీర్‌, అఖిల్‌లను అరెస్ట్‌ చేశారు. స్నేక్‌ గ్యాంగ్‌ ముఠా సభ్యులు చోరీల కోసం గుర్రాలను వాడారని ఆరోపిస్తూ జంతు హింస కింద కేసు నమోదు చేశారు. అలాగే తనిఖీల్లో భాగంగా పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 స్నేక్ గ్యాంగ్

స్నేక్ గ్యాంగ్

పహడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ఫామ్ హౌస్‌లో కాబోయే భర్తను నిర్బంధించి యువతిని పాములతో బెదిరించి, వివస్త్రను చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన నేపథ్యంలో స్నేక్ గ్యాంగ్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి.

 స్నేక్ గ్యాంగ్

స్నేక్ గ్యాంగ్

స్నేక్ గ్యాంగ్ సభ్యులపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. స్నేక్ గ్యాంగ్ తాము చేసిన నేరాలను వీడియోల్లో చిత్రీకరించింది. ఆ వీడియోలను ప్రసారం చేసిన టీవీ చానెల్‌పై కూడా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

English summary
Another 5 accused arrested in Snake Gang case on Tuesday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X