వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరాంద్రకు అమరావతి భయం : తెలంగాణను ప్రస్తావించిన ధర్మాన

By Narsimha
|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం :అమరావతి చుట్టూనే అభివృద్దిని ఎపి సిఎం చంద్రబాబునాయుడు కేంద్రీకరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. వెనుకబడిన ఉత్తరాంద్ర జిల్లాల్లో పరిశ్రమలు, ఇతర సంస్థలు నెలకొల్పాలని విభజన చట్టంలో చెప్పినా కాని, చంద్రబాబునాయుడు విస్మరించారని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ పరంపర ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఉత్తరాంద్ర తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమాన్ని ఆయన ప్రస్తావించారు. ఎపికి ప్రత్యక హోదా వల్లే ప్రయోజనం కలుగుతోందని ప్రశ్నించారు. ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించడానికి ప్రభుత్వం ఎవరని ..ఆయన ప్రశ్నించారు.

విశాఖ పట్టణంలో ప్రత్యేక హోదాపై ప్రజల ఆకాంక్షలను తెలిపేందుకు విశాఖపట్టణంలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు.ఎపికి జరిగిన నష్టాన్ని భర్తీచేసేందుకు ప్రత్యేక హోదా ఇస్తామని సాక్షాత్తూ ఆనాడు పార్లమెంట్ లో ప్రధానమంత్రి ప్రకటన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఈ ప్రకటనను సమర్థిస్తూఎన్నికల ప్రచారంలో టిడిపి, బిజెపి నాయకులు ప్రచారం చేసుకొన్నారని ఆయన విమర్శించారు.

dhar,amama prasada rao

ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఆనాటి కేంద్రం ప్రజల ముందుకు తెచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే ప్రత్యేక హోదా వదిలేసుకొంటున్నట్టుచంద్రబాబు చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. కేంద్రం నుండి వచ్చిన అర్థరాత్రి ప్యాకేజీని చంద్రబాబు ఎలా అంగీకరిస్తారని ఆయన ప్రశ్నించారు.

పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను ఎందుకు విస్మరించారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. కేంద్రంలో అధికారంలో భాగస్వామ్యిగా ఉన్న టిడిపి ఈ విషయంలో ఎందుకు నిలదీయండం లేదని ఆయన ప్రశ్నించారు.వెనుకబడిన ఉత్తరాంద్ర జిల్లాలను అభివృద్ది చేసేందుకు సిఎం చంద్రబాబునాయుడు ఏం చేశారని ఆయన
ప్రశ్నించారు.

English summary
special status is ps state peoples right siad ysrcp leader dharmana prasada rao.when tdp, bjp leaders campign also said dharmana. why cm accept special package asked dharmana.upa govt promised to state for special status.. but why nda govt impliment this special status he asked.why recevied special package tell to the people asked ysrcp leader
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X