వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్మలమ్మ బడ్జెట్‌పై సాదినేని యామిని రియాక్షన్ ఇదీ: ఆ రంగానికి మేలు చేసేలా: ఏపీ బీజేపీ నేత

|
Google Oneindia TeluguNews

అమరావతి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కొద్దిసేపటి కిందటే లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2021-2022 బడ్జెట్ ప్రతిపాదనలపై బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు స్పందించారు. ఈ సారి బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని ప్రశంసించారు.. దేశానికి అన్నం పెట్టే రైతుల శ్రేయస్సు కోసం తమ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి, రైతులకు కనీస మద్దతు ధరను కల్పించడానికి ఉద్దేశించిన చర్యలు.. ఈ బడ్జెట్‌లో ప్రస్ఫూటించాయని పేర్కొన్నారు.

నిర్మలమ్మ బడ్జెట్‌: కొత్త యాప్: ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?: ఆ భారంపైనే అందరి భయాలునిర్మలమ్మ బడ్జెట్‌: కొత్త యాప్: ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?: ఆ భారంపైనే అందరి భయాలు

రైతన్నలకు మేలు కలిగించే అనేక రకాల ప్రయోజనాలను బడ్జెట‌లో ప్రవేశపెట్టడం హర్షణీయమని ఏపీ బీజేపీ రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి, సాదినేని యామిని అన్నారు. కనీస మద్దతు ధర కంటే 1.5 శాతానికి మించి అధిక ప్రయోజనాలను కల్పించేలా బడ్జెట్‌కు రూపకల్పన చేశారని చెప్పారు. రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి, వారికి మరిన్ని ప్రయోజనాలను కల్పించడానికి పట్ల బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ వెనుకాడబోదని అన్నారు.

Stupendous increase in the payment made to farmers, says AP BJP leaders

2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం గోధుమలకు 33,874 కోట్ల రూపాయల మద్దతుధరను ఇస్తే ఎనిమిదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ మొత్తాన్ని 75,060 కోట్లకు పెంచి, ఇచ్చిందని అన్నారు. 2013: వరికి 63 వేల కోట్లు చెల్లిస్తే.. మోడీ ప్రభుత్వం ఈ మొత్తాన్ని రెట్టింపు చేసిందని చెప్పారు. 1,72,000వేల కోట్లను ఇచ్చిందని వివరించారు. చిరుధాన్యాలు 2013 లో 236 కోట్లు, 2020లో 10,530 కోట్లను ఇచ్చారని అన్నారు.

పత్తికి 2013లో అప్పటి ప్రభుత్వం ఇచ్చింది 90 కోట్లేనని, తమ ప్రభుత్వం ఈ మొత్తాన్ని 25 975 కోట్లకు పెంచిందని చెప్పారు. .వ్యవసాయ రుణాలను 16.5 లక్షల కోట్లుగా నిర్దేశించుకోవడం గొప్ప విషయమని అన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సారి 1100 కోట్లను అధికంగా కేటాయించారని చెప్పారు. వైద్య, ఆరోగ్య రంగానికి 2.23 లక్షల కోట్ల రూపాయలను కేటాయించడం హర్షణీయమని వారు వ్యాఖ్యానించారు. రక్షణ రంగానికి 4.77 లక్షల కోట్ల రూపాయలను మంజూరు చేయడం చరిత్రలో లేదని అన్నారు.

English summary
AP BJP leaders S Vishnu Vardhan Reddy and Sadineni Yamini appreciates Union Budget 2021 proposed by FM Nirmala Sitharaman on Monday. They said that Rs 1,18,452 crore has been provided as revenue deficit grant to 17 states in 2021-22 as against Rs 74,340 crore to 14 states in 2020-21.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X