మేయర్‌గా పావని ఎన్నిక వెనుక.. చక్రం తిప్పిందెవరు? నేనేంటో చూపిస్తానని శేషుకుమారి హెచ్చరిక

Posted By:
Subscribe to Oneindia Telugu

కాకినాడ: కాకినాడ నగరపాలక సంస్థ మేయర్‌గా సుంకర పావని ఎన్నికయ్యారు. 28వ డివిజన్‌ నుంచి పోటీ చేసిన ఆమెను మేయర్‌ పదవికి టిడిపి నాయకత్వం ఎంపిక చేసింది. శనివారం ఉదయం ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులందరితో ప్రమాణ స్వీకారం చేయించారు.

చదవండి: రేసులో ఉన్న నలుగురికి గాడ్ ఫాదర్లు వీరే!

అనంతరం మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక నిర్వహించారు. 16వ డివిజన్‌ కార్పొరేటర్‌ మల్లాడి గంగాధర్ రావు మేయర్‌ అభ్యర్థిగా సుంకర పావనిని ప్రతిపాదించగా ఒకటో డివిజన్‌ కార్పొరేటర్‌ పేరాబత్తుల లోవబాబు బలపరిచారు. అనంతరం పావని మేయర్‌గా ఎంపికైనట్లు కలెక్టర్‌ ప్రకటించారు.

అసంతృప్తి

అసంతృప్తి

సుంకర పావనిని మేయర్‌గా చేయడం పట్ల కార్పోరేటర్ శేషు కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. తనను మేయర్ చేస్తామని చెప్పి దగా చేశారని మండిపడ్డారు. పార్టీలో ఎన్నో ఏళ్లుగా కష్టపడి పనిచేసినా గుర్తింపు లేకుంటే ఎలాగని ప్రశ్నించారు. భర్త చాటు భార్యలకు, సిఫార్సులకే పెద్ద పీట వేశారని మండిపడ్డారు.

లోకేష్ హామీ ఇచ్చారు, అన్యాయం

లోకేష్ హామీ ఇచ్చారు, అన్యాయం

కష్టపడి పని చేసే మహిళలకు గుర్తింపు ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పే మాటలకు, ఇక్కడి పరిస్థితులకు పొంతన లేదని శేషు కుమారి అన్నారు. పార్టీ కోసం ఎంతో ఖర్చు చేశానని, ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు ఇలా పలు హామీలు ఇచ్చారని, మేయర్‌గా అవకాశం కల్పిస్తామని స్వయంగా మంత్రి లోకేష్ చెప్పారని, కానీ ఇప్పుడు కూడా అన్యాయం జరిగిందన్నారు.

కంటతడి పెట్టిన శేషు కుమారి

కంటతడి పెట్టిన శేషు కుమారి

తనకు పదవి దక్కకపోవడంతో కార్పొరేటర్ శేషుకుమారి కంటతడి పెట్టారు. గత ఎనిమిదేళ్లుగా పార్టీ అభ్యున్నతి కోసం తాను ఎంతగానో శ్రమించానన్నారు. ఎంపీ తోట నరసింహం తనకు వ్యతిరేకంగా పని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలోకి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను తీసుకొచ్చారని, ఆ తర్వాత అన్ని విధాలా అవమానించారని మండిపడ్డారు.

ముందు ముందు చూపిస్తానని హెచ్చరిక

ముందు ముందు చూపిస్తానని హెచ్చరిక

తాను కూడా కాపునేనని, దీనికి సమాధానం ఏమిటో ముందు ముందు చూపిస్తానని శేషు కుమారి హెచ్చరించారు. జిల్లా నాయకత్వం తనను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, చంద్రబాబు తనకు న్యాయం చేస్తారని భావించానని, కానీ చివరకు తనకు అన్యాయం జరిగిందన్నారు.

తోట నర్సింహం చక్రం తిప్పారా?

తోట నర్సింహం చక్రం తిప్పారా?

కాకినాడ మేయర్ పదవి సుంకర పావనిని వరించేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయని అంటున్నారు. వీరు మొదటి నుంచి పార్టీ కోసం పని చేస్తున్నారు. పైగా, ఎంపి తోట నర్సింహం చక్రం తిప్పారని అంటున్నారు. రేసులో ఉన్న ఇతరులకు యనమల, నారాయణ తదితరుల అండదండలు ఉన్నాయి. కానీ ఎంపీ తోట పైచేయి సాధించారని అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sunkara Pavani and Kalla Sattibabu were unanimously elected Mayor and Deputy Mayor of the Kakinada Municipal Corporation (KMC) on Saturday. The election, though a formality, was conducted by district Collector Karthikeya Mishra.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి