జగన్‌కు బాబు ఊహించని ట్విస్ట్! ఎమ్మెల్సీ అభ్యర్థి కేఈ, ఏరుకున్నారు.. శిల్పా సంచలన వ్యాఖ్య

Posted By:
Subscribe to Oneindia Telugu

కర్నూలు: ఎంతో ఉత్కంఠను రేపిన కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేలా ఉంది. పోటీ నుంచి వైసీపీ తప్పుకుంది. అదే సమయంలో టీడీపీ నుంచి కేఈ ప్రభాకర్ పేరును ఖరారు చేశారు. శివానంద రెడ్డి అయితే వైసీపీ బరి నుంచి తప్పుకుంటుందని ప్రచారం సాగింది.

  కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికలు, ట్విస్ట్ లే ట్విస్ట్ లు !

  చదవండి: ఎమ్మెల్సీ ఎన్నిక: చక్రం తిప్పిన బాబు, లాస్ట్ మినట్లో వైసీపీ ఔట్! జగన్ వెనుకడుగు వెనుక కారణాలెన్నో

  సోమవారం సాయంత్రం టీడీపీ ఎమ్మెల్సీ టిక్కెట్ రేసులో ఆయన పేరు వినిపించింది. ఆ తర్వాత వైసీపీ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత టీడీపీ అభ్యర్థిగా శివానంద రెడ్డి కాకుండా కేఈ ప్రభాకర్ పేరు ప్రకటించారు. కేఈ కూడా మొదటి నుంచి రేసులో ఉన్నారు.

  చదవండి: టీడీపీ భేటీలో బుట్టా రేణుక: ఎమ్మెల్సీ సీటు పెద్ద సవాలే, చంద్రబాబుకు 'వైసీపీ' ఫీవర్

  ఏదేమైనా కేఈ పేరు ఖరారు

  ఏదేమైనా కేఈ పేరు ఖరారు

  కానీ శివానంద రెడ్డి మినహా టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసినా వైసీపీ బరిలో నిలుస్తుందనే ప్రచారం నేపథ్యంలో శివానంద రెడ్డి పేరుకు వ్యూహాత్మకంగా బలం తీసుకు వచ్చారా అనే చర్చ సాగుతోంది. ఏదేమైనా చివరకు కేఈ పేరును టీడీపీ ఖరారు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌కు మంగళవారం తుది గడువు.

  ఇప్పుడు వదిలేస్తే భవిష్యత్తులో మంచి అవకాశం

  ఇప్పుడు వదిలేస్తే భవిష్యత్తులో మంచి అవకాశం

  ఎమ్మెల్సీ అభ్యర్థిపై చంద్రబాబు కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఆదివారం కర్నూలు జిల్లా నేతలతో భేటీ అయ్యారు. సోమవారం కూడా ఉదయం నుంచి రెండు దఫాలుగా భేటీ అయ్యారు. చల్లా రామకృష్ణా రెడ్డి, కేఈ ప్రభాకర్, శివానంద రెడ్డిలతో ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. ఇప్పుడు అవకాశం దక్కని నేతలకు భవిష్యత్తులో మంచి అవకాశం కల్పిస్తానని చెప్పారు. సాయంత్రం మరోసారి చర్చల అనంతరం ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ పేరును ఖరారు చేశారు.

  చంద్రబాబుకు కేఈ కృతజ్ఞతలు, ఒత్తిడి చేయలేదు

  చంద్రబాబుకు కేఈ కృతజ్ఞతలు, ఒత్తిడి చేయలేదు

  తనకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చినందుకు కేఈ ప్రభాకర్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తాము చేసిన కృషికి ఫలితం లభించిందన్నారు. తాము ఎలాంటి ఒత్తిడి చేయలేదన్నారు. ప్రజాప్రతినిధులను కొంటారనే తాము పోటీ చేయడం లేదన్న వైసీపీ వ్యాఖ్యలపై కేఈ స్పందిస్తూ.. ఆ వ్యాఖ్యలు అర్థరహితం అన్నారు. గతంలో ఆ పార్టీ రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిందని చెప్పారు.

  కేఈకి టిక్కెట్ ఇవ్వడం వెనుక

  కేఈకి టిక్కెట్ ఇవ్వడం వెనుక

  సామాజిక వర్గాలు, ప్రాంతాలు.. అన్నింటిని చూసుకొని చంద్రబాబు కేఈకి టిక్కెట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గతంలో రెండుసార్లు రెడ్డి సామాజిక వర్గానికి, నంద్యాల డివిజన్ వారికి అవకాశమిచ్చారని, ఈసారి బీసీలకు, కర్నూలు డివిజన్ వారికి ఇవ్వాలని కేఈ వర్గం.. చంద్రబాబు ముందు ప్రతిపాదన పెట్టింది. ఇది కూడా ఓ కారణం.

  శిల్పా చక్రపాణి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

  శిల్పా చక్రపాణి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

  ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి వైసీపీ తప్పుకున్న అనంతరం ఆ పార్టీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి మంగళవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన టిడిపిలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన రాజీనామా కారణంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడారు. తాను నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేశానని చెప్పారు. తాను విసిరేసిన ఎమ్మెల్సీ సీటును (పోస్టును) టీడీపీ నేతలు పోటీపడి ఏరుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

  రాజీనామా చేసిన సీటు కోసం మళ్లీ యుద్ధం అవసరం లేదు

  రాజీనామా చేసిన సీటు కోసం మళ్లీ యుద్ధం అవసరం లేదు

  కేఈ అభ్యర్థిత్వం ఖరారు కాకముందు టీడీపీలో పలువురు ఆశావహులు బాబు వద్దకు క్యూకట్టిన నేపథ్యంలో శిల్పా చక్రపాణి రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారు. తాను రాజీనామా చేసిన పదవి కోసం మళ్లీ యుద్ధం చేయాల్సిన అవసరం లేదనుకున్నానని, అందుకే పోటీ చేయడం లేదని అభిప్రాయపడ్డారు.

  అందుకే పోటీ చేయడం లేదని వైసీపీ

  అందుకే పోటీ చేయడం లేదని వైసీపీ

  కాగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడం లేదని అందుకే తాము తప్పుకుంటున్నామని వైసీపీ అంతకుముందు ప్రకటించింది. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్నదే తమ లక్ష్యమని ఆ పార్టీ చెప్పింది. టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, ఆ పార్టీ మరోసారి డబ్బులతో ప్రజాస్వామ్యాన్ని కొనుగోలు చేయకూడదనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తమ పార్టీకి ప్రజాప్రతినిధులు ఎక్కువగా ఉన్నప్పటికీ పోటీ చేయడం లేదన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telugu Desam Party announced KE Prabhakar name for Kurnool MLC bypoll on Monday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి