Chandrababu-Pawan Kalyan: పిఠాపురంలో చంద్రబాబుకు, కోనసీమలో పవన్ కు షాక్..!
ఏపీలో రెండేళ్లుగా కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు , పవన్ కళ్యాణ్ (chandrababu-pawan kalyan) రాష్ట్ర స్ధాయిలో సఖ్యతగానే ఉంటున్నా వీరి పార్టీలు టీడీపీ, జనసేన మాత్రం క్షేత్రస్ధాయిలో సై అంటే సై అంటున్నాయి. ముఖ్యంగా క్షేత్రస్ధాయిలో ఏ పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఆ ప్రాంతాల్లో వారు పట్టు కొనసాగించేందుకు ప్రయత్నిస్తుండటంతో మిత్రపక్షాలు కాస్తా ప్రత్యర్దుల్లా మారిపోతున్నారు. ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి రెండు ఘటనలు జరిగాయి.
పిఠాపురంలో కూటమి నేతల ఫ్లెక్సీ రగడ
— YSR Congress Party (@YSRCParty) April 21, 2026
ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంతో అధికారులపై వర్మ ఆగ్రహం.. పిచ్చిపిచ్చి వేషాలొద్దు అంటూ వర్మపైకి దూసుకెళ్లిన జనసేన నేత దొరబాబు
వర్మతో వాగ్వాదానికి దిగిన జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మలబాబు
పైకి పొత్తులు.. లోపల కత్తులు.. ఇక మీరు… pic.twitter.com/7m8P8Fv7GB
కాకినాడ జిల్లా పరిధిలోకి వచ్చే పిఠాపురంలో ఇవాళ స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఫొటో లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జనసేన నాయకులతో ఈ విషయంలో వాగ్వాదానికి దిగారు. దీంతో వారు కూడా వర్మకు గట్టిగా బదులిచ్చారు. పిచ్చిపిచ్చి వేషాలొద్దు అంటూ వర్మపైకి జనసేన నేతలు పెండెం దొరబాబు, తుమ్మల బాబు దూసుకెళ్లారు. దీంతో పిఠాపురంలో జనసేన-టీడీపీ విభేదాలు మరోసారి బయటపడ్డాయి.

కోనసీమ జిల్లాలో టీడీపీ-జనసేన మధ్య భగ్గుమన్న విభేదాలు
— Telugu Feed (@Telugufeedsite) April 21, 2026
పి.గన్నవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద జనసేన, టీడీపీ వాగ్వాదం
ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ ఫొటో లేదని జనసేన నేతల ఆగ్రహం
ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సమక్షంలోనే టీడీపీ- జనసేన నేతల బాహాబాహీ
డ్వాక్రా యానిమేటర్స్ కు సెల్… pic.twitter.com/ID0aXJvuMP
అలాగే కోనసీమ జిల్లాలో టీడీపీ-జనసేన మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పి.గన్నవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద డ్వాక్రా యానిమేటర్స్ కు సెల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో జనసేన, టీడీపీ వాగ్వాదానికి దిగాయి. ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ ఫొటో లేదని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సమక్షంలోనే టీడీపీ-జనసేన నేతల బాహాబాహీకి దిగారు. పవన్ కళ్యాణ్ లేని ఫ్లెక్సీ తీసేయాలంటూ జనసేన నేతలు డిమాండ్ చేశారు. కాసేపటి తర్వాత ఎమ్మెల్యే జోక్యంతో వివాదం సద్దుమణిగింది.












Click it and Unblock the Notifications