వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవుడికే డబ్బు కష్టాలు, రూ.127 కోట్ల పాత నోట్ల మార్పిడికి 'నో' : ఆర్ బి ఐ

ఆపదలో ఉన్నవాడి కష్టాలు తీర్చే ఆపద మొక్కుల వాడికి పేరున్న తిరుపతి వెంకటేశ్వరస్వామికి డబ్బు కష్టాలు వచ్చాయి. ఈ కష్టాల నుండి గట్టెక్కించాలని టిటిడి పాలకవర్గం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

తిరుమల: ఆపదలో ఉన్నవాడి కష్టాలు తీర్చే ఆపద మొక్కుల వాడికి పేరున్న తిరుపతి వెంకటేశ్వరస్వామికి డబ్బు కష్టాలు వచ్చాయి. ఈ కష్టాల నుండి గట్టెక్కించాలని టిటిడి పాలకవర్గం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది.

ఆపదలో ఉన్నవాడి కష్టాలు తీర్చుతాడని తిరువతి వెంకటేశ్వరస్వామిని భక్తులు విశ్వసిస్తారు.అందుకే తాము ఆపదలో ఉన్నసమయంలో ఆ దేవుడికి మొక్కుకొంటారు.

అయితే గత ఏడాది నవంబర్ 8వ, తేదిన కేంద్రప్రభుత్వం పెద్ద నగదు నోట్లను రద్దు చేసింది. ఈ నోట్ల రద్దు కారణంగా చాలా మంది భక్తులు రద్దుచేసిన నగదు నోట్లను తిరుపతి హుండీల్లో వేశారు.

ttd asked to state government for exchange old currency

ఇప్పటికే 127 కోట్ల రూపాయాలు హుండీ ద్వారా రద్దు చేసిన నగదు నోట్లు ఉన్నాయి.అయితే గడువు మించి పోయినందున ఈ నగదును మార్పిడి చేసేందుకు ఆర్ బి ఐ మాత్రం ఒప్పుకోవడం లేదు.

దీంతో ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని టిటిడి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రద్దు చేసిన రూ.127 కోట్ల నగదును తీసుకొని తమకు కొత్త నోట్లను ఇవ్వాలని ఆర్ బి ఐ పై ఒత్తిడి తేవాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది టిటిడి.

English summary
ttd asked to state government for exchange old currency.ttd has 127 crores old notes in hundi, rbi didn't exchange those old notes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X